ఒక అమరావతి : 6 ప్రపంచ మహానగరాల సమాహారం!

Publish Date:Mar 2, 2017

Advertisement

 

మరికొన్ని సంవత్సరాల్లో ఇండియా మ్యాప్ కి సరికొత్త హైలైట్ యాడ్ అవ్వబోతోందా? ఖఛ్చితంగా అవుననే చెప్పుకోవాలి! ఎందుకంటే, ఆంధ్రుల నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎన్నో విశేషణాలతో తయారవుతోంది! ఇప్పటిదాకా ఇండియన్ సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైద్రాబాద్... ఇవే చెప్పుకునే వారు! వీటి తరువాత అనేక చిన్న నగరాలు, పట్టణాలు మన దేశంలో వు్న్నాయి. కాని, ఇప్పుడు తెలుగు వారి అమరావతి అద్భుతమే సృష్టించబోతోంది! జరుగుతోన్న ప్రక్రియ గమనిస్తే ప్రపంచ పటంలో భారత్ కు మరో గుర్తింపు చిహ్నం రావటం గ్యారెంటీగా కనిపిస్తోంది....

 

హైద్రాబాద్ నుంచి అసెంబ్లీ, సచివాలయం మొత్తానికి మొత్తంగా తరలించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి ఆవిష్కరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అత్యాధునిక హంగులతో తయారైన ఏపీ అంసెబ్లీ ఆల్రెడీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా త్వరలో రాజధాని అమరావతిని అలంకరించనున్న భారీ నిర్మాణాలు ఆంధ్రుల ఖ్యాతి మరింత పెంచనున్నాయి. ఇందుకోసం అమరావతి నిర్మాణాల్ని డిజైన్ చేయాల్సిందిగా ఆంధ్ర సర్కార్ ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్ నర్స్ ను కోరిన విషయం తెలిసిందే. అందులోని ఆర్కిటెక్ట్స్ ఎంతో శ్రద్ధగా డిజైన్ చేసిన ప్లాన్స్ ఇప్పుడు సీఎం ముందుకు చేరాయి. క్యాబినేట్ లో మంత్రులు కూడా ఆమోదించాక నిర్మాణాలు మొదలవుతాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, అమరావతి నిర్మాణాలు ప్రపంచపు అత్యుత్తమ నగరాల్లోని అతి శ్రేష్ఠమైన అంశాలు పుణికిపుచ్చుకోవటమే!

 

అమరావతిలో నిర్మించబోయే వాల్డ్ క్లాస్ స్ట్రక్చర్స్ కజక్ స్థాన్ లోని ఆస్తానా నగరంలో వున్న నిర్మాణాల్ని పోలి వుంటాయి. అంతే కాదు, మలేషియాలోని పుత్రజయ నగరం, బ్రెజిల్ లోని బ్రసిలియా నగరం, అమెరికాలోని వాషింగ్టన్ నగరం, బ్రిటన్లోని లండన్, మన న్యూ ఢిల్లీ నగరం... వీటన్నిటిలోని విశేషాలు కూడా అమరావతిలో తొణికిసలాడనున్నాయి! ఇలా ప్రపంచపు అత్యుత్తమ ఆరు నగరాల లక్షణాలు అమరావతిలో అలరించనున్నాయి!

 

ఇండియాలోని ఆధునిక నగరాలు చాలా తక్కువ. మన మహానగరాలన్నీ వందల ఏళ్ల పురాతనమైనవీ. కొన్నైతే వేల ఏళ్ల చరిత్ర కలిగినవి. కాని, అమరావతి మోడ్రన్ ఇండియాకు సంకేతంగా మోడ్రన్ మెట్రోపోలిస్ గా నిలవనుంది!

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.