ఏపీ మంత్రుల లాబీయింగ్ పురాణం!

Publish Date:Jul 19, 2014

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు మంజూరు అయ్యాయి. ఆయా విద్యా సంస్థలను, పరిశ్రమలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలోని వారు మాత్రం అలాంటి విశాల దృక్పథం ప్రదర్శించకుండా తాము తమ ప్రాంత అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

ప్రతిష్ఠాత్మకమైన పెట్రోలియం యూనివర్సిటీని కాకినాడలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయలన్ని తమ జిల్లాకు తన్నుకుపోవాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

 

కేంద్రం ప్రతిపాదించిన కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు జిల్లాలలోనే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గట్టి పట్టుదల మీద వున్నారు. వేరే మంత్రులు ఎవరైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం మీద కర్చీఫ్ వేస్తే ఆయన ఎంతమాత్రం సహించేట్టు లేరు.

 

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి మంజూరు చేసిన ఎయిమ్స్.ని గుంటూరు - విజయవాడ మధ్యలో వున్న మంగళగిరిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం ఎయిమ్స్.ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లాకు తరలించుకుపోవాలని ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు.

 

తిరుపతిలో ఐఐటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఐఐటీ మా నియోజకవర్గంలో పెట్టాంటే మా నియోజకవర్గంలో పెట్టాలని చంద్రబాబు మీద వత్తిడి పెంచుతున్నారు. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ని కర్నూలు జిల్లాకి ఇచ్చి తీరాల్సందేనన్న పట్టుదలను ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకే చెందిన మరో మంత్రి పరిటాల సునీల అనంతపురాన్ని రాష్ట్రానికి రెండో రాజధాని చేసితీరాలని నినదిస్తున్నారు.

 

అనంతపురం జిల్లాకే చెందిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన జిల్లాకు భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలను తరలించుకువెళ్ళే ప్రయత్నాలు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇక రాష్ట్రమంతటా అమలు చేసే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మొట్టమొదటగా హిందూపురం నియోజకవర్గంలోనే అమలు చేసే విషయంలో నందమూరి బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలో ఇలా లాబీయింగ్ చేయగలిగినవారు తమ ప్రాంతానికి ఏమేం కావాలో సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటే, తమ ప్రాంతానికి కావలసిన వాటిని డిమాండ్ చేసి సాధించుకునే శక్తిలేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక మథనపడిపోతున్నారు.

 

ఏది ఏమైనప్పటికీ ఎంతో అభివృద్ధి జరగాల్సి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎవరి ప్రాంతం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమదృష్టితో చూస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాబీయింగ్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టి అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి జరిగేలా చూస్తే బాగుంటుందన్న ఆకాంక్షలూ వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.