LATEST NEWS
  రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం కాగా, ఇక్కడ ఏపీలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని గుర్తు చేశారు. 2020 నుంచి 2024 వరకు దాదాపు నాలుగేళ్లపాటు ఇద్దరూ సీఎంలుగా కొనసాగినప్పటికీ ఎన్జీటీ స్టే కొనసాగడమే వీరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఎన్జీటీ స్టే విధించిందా? పనులు ఆపిందా? పెనాల్టీ వేసిందా? అని ప్రశ్నించారు. లిఫ్ట్ పనులే ప్రారంభించకుండా వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కేవలం మట్టి పనులకే పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడంలో ఎన్జీటీ స్టే అడ్డురాలేదని, కానీ అసలు లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్పే సినిమా కథలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా నిజాన్ని అర్థం చేసుకున్నారని, వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు.
  తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో మంగంపేట గనుల అంశంపై జామీన్ రైతు, ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ప్యాక్షనిజానికి ప్రధాన మూలం మంగమ్మపేట గనులేనని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలకు నిజంగా లాభమా, లేక సీమ పేరుతో కొద్దిమందికే లాభమా అన్న ప్రశ్నను లేవనెత్తారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనింగ్ వ్యాపారం చేసిన విషయం, ఆయన తండ్రి రాజారెడ్డి నేర సామ్రాజ్యం గనుల నుంచే మొదలైందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఒక ప్రభుత్వం చేసిన తప్పులను తర్వాతి ప్రభుత్వం కాపాడుతుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను వచ్చే ప్రభుత్వం రక్షించే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. వ్యవస్థ మొత్తం అవినీతి చక్రంలో చిక్కుకుపోయిందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగి వద్ద సుమారు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు బయటపడటం పాలనలో ఉన్న అవినీతికి నిదర్శనమని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 15) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  
  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్యం విషయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఒక పక్క క్రెడిట్ వార్ కొనసాగుతుండగానే.. తెలంగాణలో కూడా మరో క్రెడిట్ వార్ మొదలైంది. పొలిటికల్ గా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి నేతల ఆరాటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయితే అడ్డగోలుగా తాను అవసరం లేదంటూ వాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆ ఎయిర్ పోర్టు ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి పడుతున్న తాపతయం నవ్వుల పాలౌతోంది. అది పక్కన పెడితే.. తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది. సదరు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి బాహాబాహీదాకా వెళ్లింది. ఇదే విషయంలో ఈటల, మర్రి రాజశేఖరరెడ్డిల మధ్య వాగ్వాదం కూడా ముదిరింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకోండి అది వేరే సంగతి.  విషయమేంటంటే మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కు శంకుస్థాపన కార్యక్రమంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తన ఘనత అంటే తన ఘనత అంటూ ఈటల, మర్రి వాదనకు దిగారు. దీంతో శంకుస్థాపన సందర్భంగా బీజీపీ, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.   పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా.. మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్ లో విజయం ఎవరిదో?
సోమవారం ఉదయం, పోలవరం-నల్లమల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని, రాష్ట్ర ప్రభుత్వ చట్టపరమైన విధానానికి ఎదురుదెబ్బ తగిలిందని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కవిత Xలో పోస్ట్ ద్వారా ఈ పరిణామంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌తో కృష్ణా, గోదావరి జల వివాదాలను పరిష్కరించడంలో పాలక ముఖ్యమంత్రి మరోసారి తన అసమర్థతను చూపించారని ఆమె అన్నారు. నీటి హక్కులపై పొరుగు రాష్ట్రాలతో పోరాడకూడదని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణకు దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కోర్టు ఫలితం తెలంగాణకు మరో అడ్డంకిని జోడించిందని కవిత పేర్కొన్నారు. రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల పోలవరం-నల్లమల సాగర్ లిఫ్ట్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణంపై తెలంగాణ హక్కులు బలహీనపడ్డాయి. ఈ చర్య రాష్ట్రాన్ని రక్షించడానికి బదులుగా రాష్ట్ర స్థానాన్ని దెబ్బతీసిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరియు కొంతమంది కీలక ప్రభుత్వ సభ్యులు తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజల నీటి హక్కులు నిరాకరించబడుతున్నాయని కవిత ఆరోపించారు. ఆ హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి ఏపీ నీటి ప్రాజెక్టులపై పోరాడుతుందని ఆమె నొక్కి చెప్పారు.
ALSO ON TELUGUONE N E W S
  చాలా కాలం తర్వాత ఆది సాయికుమార్ కి రిలీఫ్ ఇచ్చిన మూవీ 'శంబాల'. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్.. వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.   శంబాల' మూవీ ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. జనవరి 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ ఒక రోజు ముందుగానే ఈ సినిమాను చూడొచ్చు.     మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకున్న 'శంబాల' సినిమాని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.    థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించిన శంబాల.. ఓటీటీలో కూడా అదే స్థాయి స్పందన తెచ్చుకుంటుందేమో చూడాలి.   Also Read: శంబాల మూవీ రివ్యూ  
  ఈ సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. 'ది రాజా సాబ్'తో ప్రభాస్, 'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవి బాక్సాఫీస్ బరిలో నిలిచారు. రాజా సాబ్ మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకోగా.. 'మన శంకర వరప్రసాద్ గారు' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో చిరంజీవి సంక్రాంతి విన్నర్ అని అందరూ అనుకున్నారు. అయితే కంటెంట్ పరంగా చిరంజీవి సినిమా కంటే, మరో సినిమా విన్నర్ గా నిలిచింది.   ది రాజా సాబ్: (తెలుగువన్ రేటింగ్: 2.5/5) ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ ఫిల్మ్ 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐడియా బాగానే ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లో మారుతి తడబడ్డాడు. దీంతో మొదటి షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి, ప్రభాస్ ఓల్డ్ గెటప్స్ సీన్స్ యాడ్ చేయడంతో అవుట్ పుట్ కాస్త మెరుగుపడింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.   Also Read: ది రాజా సాబ్ మూవీ రివ్యూ    మన శంకర వరప్రసాద్ గారు: (తెలుగువన్ రేటింగ్: 2.75/5) చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఫిల్మ్ 'మన శంకర వరప్రసాద్ గారు'. నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టింది. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ.. కామెడీ వర్కౌట్ అయింది. చిరంజీవి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా అనిల్ రావిపూడి ఈ సినిమాని మలిచాడు.   Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ    భర్త మహాశయులకు విజ్ఞప్తి: (తెలుగువన్ రేటింగ్: 2.5/5) రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). జనవరి 13న విడుదలైంది. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. వైఫ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ కనిపించాడు. కామెడీ బాగానే పండింది. గొప్ప సినిమా కాకపోయినా.. రీసెంట్ టైమ్స్ లో రవితేజ నుంచి వచ్చిన బెటర్ ఫిల్మ్ అనిపించుకుంది. సోలోగా రిలీజ్ అయ్యుంటే.. ఇంకా బెటర్ రిజల్ట్ ఉండేది.   Also Read: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ    అనగనగా ఒక రాజు: (తెలుగువన్ రేటింగ్: 2.75/5) హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన మూవీ 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్. నూతన దర్శకుడు మారి రూపొందించాడు. సితార ఎంటెర్టైనమెంట్స్ నిర్మించిన ఈ మూవీ జనవరి 14న రిలీజ్ అయింది. ఈ సినిమాలో నవీన్ వన్ మ్యాన్ షో చూపించాడు. డైలాగ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నవ్వులు పూయించింది. సెకండ్ హాఫ్ లో నవ్వుల డోస్ తగ్గినా.. చివరిలో ఎమోషన్ పండింది.    Also Read: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ    నారీ నారీ నడుమ మురారి: (తెలుగువన్ రేటింగ్: 3.25/5) ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానంభవతి వంటి విజయాలతో ఈ జనరేషన్ సంక్రాంతి హీరోగా పేరుపొందిన శర్వానంద్, ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. సంక్రాంతి సినిమాలలో ప్రమోషన్స్ పరంగా తక్కువ హడావుడి చేసింది ఈ సినిమానే. కానీ, కంటెంట్ పరంగా మాత్రం అన్ని సినిమాల కంటే టాప్ లో ఉంది. అన్ని విభాగాలు కరెక్ట్ గా పనిచేసి, ఒక మంచి ఎంటెర్టైనర్ ను ప్రేక్షకులను అందించారు. ఈ సినిమాకు క్రమంగా థియేటర్లు పెరగడంతో పాటు, లాంగ్ రన్ ఉండే అవకాశముంది.   Also Read: నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ    మొత్తానికైతే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమా కనుక.. వసూళ్ల పరంగా 'మన శంకర వరప్రసాద్ గారు' టాప్ లో ఉంటుంది. కానీ, కంటెంట్ పరంగా మాత్రం 'నారీ నారీ నడుమ మురారి' ఈ సంక్రాంతి విన్నర్ అని చెప్పవచ్చు.  
Under the visionary presentation of Dil Raju, the upcoming film Yellamma is set to delve deep into the rich tapestry of Indian folklore and spiritual traditions. Directed by Venu Yeldandi, the film follows the director's trend of exploring rooted, culturally significant narratives that resonate with local audiences. Produced by Shirish for Sri Venkateswara Creations, the project is being hailed as a "musical social drama" that bridges the gap between ancient beliefs and modern storytelling. At the heart of this ambitious project is Rockstar Devi Sri Prasad, who takes on the lead role of a traditional percussionist named Parshi. This character is expected to showcase a side of DSP never seen before, blending his natural rhythmic energy with a grounded, dramatic performance. Set against a rural backdrop, the film explores the mysticism surrounding the divine force of Yellamma, a deity deeply revered in regional culture. The first glimpse, released on Makara Sankranthi, has already set a mysterious and emotional tone, highlighting the film’s high production values and soulful atmosphere. By combining the musical genius of DSP with the sensitive direction of Venu Yeldandi, Yellamma aims to be more than just a debut; it is a cinematic tribute to native heritage and the power of faith.
Telugu ZEE5 has unveiled a Sankranthi brand film featuring ‘Manchu Manoj’, celebrating the spirit of the festival while reinforcing the platform’s promise of delivering entertainment that truly belongs to Telugu audiences. With the communication line ‘Mana Pandaga, Mana Entertainment, Mana Telugu ZEE5,’ the campaign reflects the platform’s deep cultural connection with the region and its viewers. Set in a traditional village manduva house during Sankranthi, the brand film captures the warmth, humour, and emotional bonding of a festive family gathering. The narrative follows Manoj’s journey from a bus ride back to his village to a lively homecoming filled with playful moments, and humorous banter between family members. The story culminates in a high-energy celebration, highlighting Telugu ZEE5 as the go-to entertainment companion for the year.  Directed by Sai Marthand and DOP by Suriya Balaji, known for their work in series ‘Little Hearts’, the film blends festive nostalgia with contemporary storytelling, using its content offering with a diverse slate of films and series that cater to a wide range of audience preferences. The platform has already made its mark with popular titles such as Beauty, Nayanam, Bhairavam, Sankrantiki Vasthunam, Kishkindapuri, and Hanuman. Looking ahead, Telugu ZEE5 is set to bring major releases including films starring Chiranjeevi and Nayanthara’s starrer ‘Mana Shankara Vara Prasad Garu’, and Ravi Teja’s featuring Bhartha Mahasayulaku Wignyapthi, and Gurram Papireddy ensuring a steady flow of high-impact entertainment for its viewers. Speaking about the campaign, Anuradha Guru, Business Head – Telugu ZEE5, said, “At Telugu ZEE5, our focus is on bringing a diverse mix of entertainment that truly reflects the tastes of Telugu audiences, from rooted family dramas and festive entertainers to gripping thrillers and big-ticket star films. With our previous and upcoming films featuring stars like Chiranjeevi, Nayanthara, and Ravi Teja, we are building a strong, consistent content pipeline. This Sankranthi campaign reflects what we stand for: culturally rooted stories, mass entertainment, and content that families can enjoy together on Mana Telugu ZEE5.” Actor Manchu Manoj, the face of the Sankranthi campaign, shared, “Sankranthi is all about family, laughter, and togetherness. This film brought back memories of the fun, light-hearted roles I’ve enjoyed earlier, and it felt refreshing to revisit that space. I loved how naturally the story captures the festive mood, and being part of a Zee5 Telugu campaign that celebrates family emotions made it even more special.” With its culturally rooted storytelling, strong content lineup, and festive brand communication, Telugu ZEE5 continues to strengthen its position as a platform that celebrates Telugu entertainment in all its forms, making this Sankranthi truly special for its audiences. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
      -మంచు విష్ణు కీలక నిర్ణయం  -ఇంతకీ ఏం చెప్పదలచుకున్నాడు -మరి మీరు డైరెక్షన్ చేస్తారా!   మంచు విష్ణు(Manchu vishnu)గత ఏడాది జూన్ లో ఎపిక్ డెవోషనల్ ఫిలిం 'కన్నప్ప' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దేవుడి పేరుపై జరిపే మూఢనమ్మకాలని, శివుడ్నివ్యతిరేకించే తిన్నడు అనే అడవి బిడ్డగా, ఆ తర్వాత శివుడు ఉన్నాడని గుర్తించి ఆయన రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడికి(Srikalahasteeswarudu)ప్రియ భక్తుడుగా మారి తన రెండు కళ్ళు సమర్పించే కన్నప్ప గా విష్ణు నటన ఒక రేంజ్ లో ఉంటుంది.ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక సరికొత్త ప్రకటన చేసాడు.   ఎక్స్ వేదికగా రిలీజ్ చేసిన వీడియోలో విష్ణు మాట్లాడుతు మన టాలెంట్ ని తెలియచేయడానికి  ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్, యూట్యూబ్ వంటివి ఉన్నాయి. కానీ ప్లాట్ ఫార్మ్ ఉంటే సరిపోదు. మీరు ఎదగడానికి  ప్రాపర్ అవకాశం కావాలి. యాభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో కి వచ్చిన మా నాన్న గారిలో ఉన్న  టాలెంట్ ని గుర్తించి దాసరి నారాయణరావు గారు ప్రోత్సహించారు. మా నాన్న గారి జీవితాన్ని ఆ రోజు ఆయనిచ్చిన ఒక్క అవకాశం మార్చేసింది. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని  'ఎవా' ఇంటర్ నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ని అనౌన్స్ చేస్తున్నాను. ఇది కేవలం షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నే కాదు మీలో ఉన్న డైరెక్షన్ స్కిల్స్ ని గుర్తిస్తుంది.  also read:  తెలుగు సినిమా గెలిచిందోచ్.. కానీ ఆ ఒక్కటి మాత్రం అడక్కు   మీరు షూట్ చేసిన 10 నిమిషాల షార్ట్ ఫిలిం లో విజేతగా నిలిచిన వాళ్ళకి  10 కోట్ల రూపాయిల ఫీచర్ ఫిలిం డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది . విన్నర్ ని మా నాన్న బర్త్ డే రోజున మార్చి 19 న ప్రకటిస్తామని చెప్పాడు. సదరు షార్ట్ ఫిలిం కి సంబంధించిన పూర్తి  డీటెయిల్స్ తెలుసుకోవడానికి  వాట్స్ అప్ నెంబర్ ని కూడా విష్ణు ఇవ్వడం జరిగింది.        https://x.com/iVishnuManchu/status/2011680932995203471?s=20
    -తెలుగు సినిమా అభిమానులు ఏమంటున్నారు - సంక్రాంతి చిత్రాల రిపోర్ట్ ఏంటి! -బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుందా -ఇంతకీ ఆ ఒక్కటి  ఏంటి   తెలుగు సినిమా అభిమానులు నిత్యం జపించే మంత్రం తెలుగు సినిమా గెలవాలని. ఈ సంక్రాంతి ఐదు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో వాళ్ళల్లో ఒకింత టెన్షన్ కూడా ఏర్పడింది. సంక్రాంతి పోటాపోటీలో ముందుగా హిట్ టాక్ వచ్చిన సినిమాకి, ఆ తర్వాత వచ్చిన సినిమాకి కంపేర్ చేస్తు నెగిటివ్ టాక్ తెస్తారేమో అనేదే వాళ్ళ ప్రధాన టెన్షన్.  కానీ సంక్రాంతి సినిమాలపై ప్రేక్షకుల ఇచ్చిన తీర్పు  తెలుగు సినిమా అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. వాటి వివరేలేంటో చూద్దాం.   ఈ సంక్రాంతికి రాజాసాబ్(The Rajasaab)తర్వాత వరుసగా మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku wignapthi)అనగనగ ఒక రాజు(Anaganaga Oka Raju), నారీనారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)సంక్రాంతి వెలుగుల్ని మరింతగా పెంచుతూ సిల్వర్ స్క్రీన్ పై సినీ పరిమళాల్ని వెదజల్లడానికి వచ్చాయి. ఈ సినిమాలని వీక్షించిన ప్రేక్షకులు మాట్లాడుతు నాలుగు చిత్రాలు చాలా బాగున్నాయి. పైగా    ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో తెరకెక్కి థియేటర్స్ లో నవ్వుల జడివాన కురిపిస్తున్నాయి. తెలుగు సినిమాకి మరింత మంచి రోజులు వచ్చాయనేలా ఈ సారి హీరో, హీరోయిన్స్ దగ్గరనుంచి అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ చూపించాయి.   ఒక మూవీకి మరో మూవీ కి పోలిక కూడా లేకుండా సంక్రాంతి కి పర్ఫెక్ట్ విందు దొరికినట్లయింది. నాలుగు కూడా హిట్. కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని రాబడతాయి. ప్రతి సంక్రాంతి ఇదే విధంగా వీనుల విందు లాంటి సినిమాలు మరిన్ని  వచ్చి విజయాన్ని అందుకోవాలి. రాజా సాబ్ ఈ విషయంలో కొంచం వెనకపడిందని ప్రేక్షకులు  అంటున్నారు. దీంతో తెలుగు సినిమా అభిమానులు నూతనోత్సాహంతో సంబరాల్లో మునిగిపోయారు. పూర్తి రన్నింగ్ లో ఆయా చిత్రాలన్నీ సాధించే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు.       
  Sankranti 2026 festival is here and this time around Telugu Cinema saw five releases. Big stars like Megastar Chiranjeevi, Prabhas and Ravi Teja came with entertainers along with young stars like Naveen Polishetty and Sharwanand. With no dubbing film releases, each film had family entertainment at the core and all films have been released by 14th January. Let's look at each film at a glance and decide which one ends up being more entertaining.    The Raja Saab: Prabhas starrer had least hype amongst the big star hero films as director Maruthi's brand name did not help Prabhas to ignite fan frenzy for it. While the old Prabhas get up did create some buzz, the movie ended up being too weak and narrative wise very boring. Upon release, the performance by Prabhas got praises but choosing to leave out Old Prabhas portions cost dearly. Movie ended up as an embarrassment for the big star and Sankranti season did not help it.    Mana Shankara Vara Prasad Garu: Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi have come together for the first time for this film. Victory Venkatesh did a cameo and Nayanthara played leading lady role. Brand Anil Ravipudi mark entertainment and Chiranjeevi's vintage style and swag did help it. But the movie did not innovate much and it ends up as an average safe-bet entertainer aiming festival. Box Office initial numbers are great but content wise makers played too safe a game.    Bhartha Mahasayulaku Wignapthy: Ravi Teja decided to Mass Maharaja image and go back to his Dubai Seenu style entertainer for this film. While his intent is good his script selection is still old school. The movie being too predictable did not help its course to get a gloring reviews and content wise the film is a letdown too. Still, it had its moments and it looked like it is aimed only at Sankranti festival crowds. Director Kishore Tirumala, Ashika Ranganath and Dimple Hayathi have tried to push it much with Ravi Teja not promoting much.      Anaganaga Oka Raju: Naveen Polishetty has over promoted the film trying to make it visible amongst all Sankranti releases. His strategy worked to an extent in gaining eyeballs but it created hype too. It became a hindrance for the film as content could not fully live up to it. Movie is marginally enjoyable but the first 30-40 minutes looked out-of-place. Meenakshi Chaudhary did well but movie entirely depending on Naveen also acted against it.    Nari Nari Naduma Murari: Sharwanand starrer has come up with a decent entertaining script that aims at tickling your rib and be silly at the same time. It did not take itself too seriously and the tone is set well. Satya, Sampath, Naresh, Vennela Kishore, Sunil, Sudharshan all have been used wisely and Ram Abbaraju delivered a decent entertainer that stands out among the films offered. Samyuktha and Sakshi Vaidya had less to do but they did not hamper the proceedings.    So, this is our take on films at a glance. You can read our full reviews about each film in detail as well. Have a great Sankranti and enjoy the films you choose to watch theatres only.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
  తారాగణం: జగపతిబాబు, సుహాసిని, వై.జి.మహేంద్రన్, తలైవాసల్ విజయ్ తదితరులు  సంగీతం: తేనిసాయి తెంద్రల్ దేవా డీఓపీ: సంజయ్ ఎడిటర్: రిచర్డ్ రచన, దర్శకత్వం: సురేష్ కృష్ణ  బ్యానర్: ఇన్నర్ వ్యూ ఓటీటీ: జియో హాట్ స్టార్    పుట్టపర్తి సత్యసాయి బాబా మహిమల ఆధారంగా తెరకెక్కిన చిత్రం అనంత. జగపతిబాబు, సుహాసిని కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బాషా ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా రూపొందించిన 'అనంత' చిత్రం తాజాగా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే..? (Anantha Movie Review)   కథ: ముంబైకు చెందిన వర్ధన్ రావు(జగపతిబాబు), కేరళకు చెందిన మహదేవన్(వై.జి.మహేంద్రన్), చెన్నైకు చెందిన మీనాక్షి, కాశీకి చెందిన అన్నపూర్ణ(సుహాసిని), కలకత్తాకు చెందిన జాన్.. ఈ ఐదుగురు సత్యసాయిబాబా భక్తులు. లక్షలాది భక్తులుండగా ఈ ఐదుగురిని పుట్టపర్తికి రమ్మని ప్రత్యేక ఆహ్వానం అందుతుంది. ఈ ఐదుగురు ఎందుకంత ప్రత్యేకం? వీరి కథలేంటి? అసలు వారు సత్యసాయి భక్తులుగా ఎలా మారారు? సత్యసాయి మహిమలు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: వాస్తవ వ్యక్తులు, వాస్తవ సంఘటనలకు కల్పిత సన్నివేశాలను జోడించి ఓ భక్తి చిత్రం రూపొందించడం అనేది కత్తి మీద సాము లాంటిది. అలాంటి సాహసమే ఈ చిత్ర బృందం చేసింది. ఇది ఐదు కథల సమాహారంగా తెరకెక్కింది. విభిన్న ప్రాంతాలు, విభిన్న రంగాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు.. సత్యసాయి బాబాకు భక్తులుగా ఎలా మారారు? వారి జీవితాలపై సత్యసాయి ఎలాంటి ప్రభావాన్ని చూపారు? అనేది ఈ సినిమాలో చూపించారు.  సత్యసాయి భక్తులకు నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది బోర్ కొట్టించవచ్చు, డాక్యుమెంటరీ చూస్తున్నామనే ఫీలింగ్ ని కలిగించే అవకాశముంది. పుట్టపర్తిలో సత్యసాయి ఆశ్రమం, అక్కడి భక్తులను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐదుగురు ప్రత్యేక భక్తుల పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయమవుతాయి. ప్రారంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. అయితే ఐదుగురు భక్తుల పాత్రలు పరిచయమయ్యాక.. అసలు వారు ఎవరు? బాబాకు వారు ఎందుకంత ప్రత్యేకం? అనే ఆసక్తిని కలిగిస్తూ సినిమా నడుస్తుంది. ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ వర్ధన్ రావుగా జగపతిబాబు కనిపించాడు. ఆ పాత్రను ఆయన సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళాడు. కానీ సత్యసాయి మహిమను తెలుపుతూ వర్ధన్ రావు పాత్ర చుట్టూ రాసుకున్న సన్నివేశాలు కొన్ని సహజత్వానికి దూరంగా ఉన్నాయి.  ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక బిడ్డకు తల్లిగా అన్నపూర్ణ పాత్రలో సుహాసిని నటించింది. ఈ ట్రాక్ లో తల్లీకొడుకుల మధ్య మంచి ఎమోషన్ ఉంది. డాక్టర్ గా సత్యసాయి వచ్చి బిడ్డను కాపాడటం బాగుంది. అయితే ఈ ఎపిసోడ్ నిడివి కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే అనారోగ్యంతో భార్యను దూరం చేసుకున్న భర్త, కాలికి దెబ్బ తగిలి నాట్యం చేయలేక ఇబ్బందిపడే నృత్యకారిణి, ఆపదలో చిక్కుకున్న వ్యక్తి ఇలా విభిన్న కథల సమాహారంగా ఇది తెరకెక్కింది.  ఇలా ఐదుగురు భక్తుల కథల ద్వారా సత్యసాయి మహిమల గురించి చెప్పాలన్న ఆలోచన బాగుంది. అయితే రచన ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలు ఆర్టిఫిషీయల్ గా అనిపిస్తే, మరికొన్ని ల్యాగ్ అనిపిస్తాయి. ఎమోషన్ ని విజువల్ గా చెప్పడం కంటే.. మాటల రూపంలోనే ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించారు. కొన్ని సీన్స్ లో పేజీల పేజీల డైలాగ్స్ ఆర్టిస్టుల చేత చెప్పించడం.. సినిమా ఫ్లోకి బ్రేకులు వేసింది. సాధారణ ప్రేక్షకులకు ఎలా ఉన్నా.. సత్యసాయి భక్తులకు ఈ చిత్రం నచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కొన్ని సత్యసాయి రియల్ విజువల్స్ చూపించడం.. భక్తులను మంచి అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. దర్శకుడిగా సురేష్ కృష్ణ తన స్థాయిలో కాకపోయినా.. ఉన్న వనరులతో పరవాలేదు అనిపించుకున్నాడు. తేనిసాయి తెంద్రల్ దేవా సంగీతం డివోషనల్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. సంజయ్ కెమెరా పనితనం బాగానే ఉంది. రిచర్డ్ ఎడిటింగ్ బెటర్ గా ఉండాల్సింది. సీన్స్ నిడివి ఎక్కువైపోయింది. చాలా షాట్స్ ని షార్ప్ గా కట్ చేయలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.   ఫైనల్ గా.. సత్యసాయిబాబా భక్తులకు నచ్చే చిత్రం.   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
    -ప్రేక్షకులు ఏమంటున్నారు -మెస్మరైజ్ చేస్తున్న అంశాలు ఏవి  -ఈ సారి రికార్డు కలెక్షన్స్ తప్పవా     సంక్రాంతి బరిలో నేను మాత్రం ఎందుకు ఉండనంటు సాక్షివైద్య(sakshi Vaidya),సంయుక్త మీనన్(samyuktha Menon)ని వెంట పెట్టుకొని నిన్న ఈవినింగ్ షోస్ నుంచి శర్వానంద్(Sharwanand)సిల్వర్ స్క్రీన్ పై నారీనారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)తో అడుగుపెట్టాడు. అడుగుపెట్టడమే కాదు అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులందరి చేత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించాడు. అన్ని ఏరియాస్ నుంచి అదే రిపోర్ట్. ఎంటర్ టైన్ మెంట్, క్యారెక్టర్స్ డిజైన్, స్టోరీ ఒక రేంజ్ లో ఉండటంతో పాటు మూవీలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయని ప్రేక్షకులు మీడియా ముఖంగా చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం.   1 . శర్వానంద్ పెర్ ఫార్మెన్స్ అండ్ లుక్  2 . శర్వానంద్, నరేష్ మధ్య వచ్చిన సీన్స్  3 . శర్వానంద్, సాక్షి వైద్య మధ్య బాండింగ్  4 శర్వానంద్, సంయుక్త మీనన్ ఫ్లాష్ బ్యాక్  5 . సంపత్ క్యారక్టర్ డిజైన్  6 . సత్య కామెడీ ట్రాక్  7 . నరేష్ అండ్ వైఫ్ ఎపిసోడ్ ట్రాక్  8 . సునీల్ పెర్ ఫార్మెన్సు  9 . వెన్నెల కిషోర్ క్యారక్టర్ డిజైన్  10 . శర్వానంద్, సంపత్, నరేష్ తో వచ్చిన సీన్స్  11 . ఇంటర్వెల్ బ్లాక్  12 . డైలాగ్స్  13  . స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్  14 . కథ. కథనాలు 15  . ఫొటోగ్రఫీ 16 .ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్  మరి ప్రేక్షకుల చెప్తున్న హైలెట్స్ ని బట్టి  ఈ సారి శర్వానంద్  రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనే మాటలు ట్రేడ్ వర్గాల్లో వినపడుతుంది.  ఈ నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటం నారీ నారీ నడుమ మురారి కి మరింత కలిసొచ్చే అంశం. రామ్ అబ్బరాజు(Ram Abbaraju)దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara)నిర్మించాడు.      
  In a decisive legal victory for Malayalam star Nivin Pauly, the Vaikom First Class Judicial Magistrate Court has ordered the registration of a criminal case against film producer P.S. Shamnas. The court found merit in allegations that Shamnas utilized forged documents and false affidavits in a deliberate attempt to frame the actor in a high-stakes cheating case.   The conflict originated over the production rights for the upcoming sequel, Action Hero Biju 2. Shamnas had previously filed a complaint alleging that Nivin Pauly and director Abrid Shine defrauded him of ₹1.9 crores. He claimed that following their collaboration on Mahaveeryar, he was promised a co-production stake in the sequel that never materialized.   The tide turned when Nivin Pauly presented evidence suggesting the producer had misled the judiciary. The court noted that Shamnas committed perjury by swearing an affidavit claiming no other litigation was pending between the parties, despite an active case in the Ernakulam Commercial Court.   Furthermore, investigation into the documents submitted to the Kerala Film Chamber of Commerce revealed that Shamnas allegedly forged Nivin Pauly’s signature. This was reportedly done to illegally register the film’s title under Shamnas’s banner, Indian Movie Makers, bypassing the actor's own production house.   Following these findings, the court directed the police to file non-bailable charges against the producer. This development follows a similar probe by the Palarivattom police, who had already booked Shamnas for forgery.   For Nivin Pauly, the ruling serves as a significant vindication. The actor has been vocal about the "calculated conspiracies" designed to damage his reputation. This case highlights a stern judicial stance against the misuse of legal machinery for personal vendettas, ensuring that those who manufacture fake cases face the full weight of the law.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు.  జీవితంలో ఎవరికి వారు బాగుండాలంటే దానికి కావాల్సింది తమ చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం లేదా వారు  అర్థం చేసుకోవడం కాదు.  ప్రతి వ్యక్తి తాము మారితేనే తమ జీవితం బాగుంటుందని అంటున్నారు లైప్ స్టైల్ నిపుణులు. కొత్త సంవత్సరంలో చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు.  అయితే దానికోసం మొదటగా ప్రతి ఒక్కరు తనకు తాను మారాలి అనే సంకల్పం చేసుకుంటే అదే గొప్ప మలుపు అవుతుంది.  ఇది ఎందుకు మేలు చేస్తుంది? దీని కోసం ఏం చేయాలి? అనే విషయం తెలుసుకుంటే.. అహంకారం.. దూరం..  కుటుంబం అయినా, స్నేహం అయినా లేదా ఆఫీసు  అయినా మనిషిలో ఉండే  అహం సంబంధాలలో చీలికకు అతిపెద్ద కారణం అవుతుంది. చాలా సార్లు అవతలి వ్యక్తి సరైన విషయం చెబుతున్నా  అది  వినే వారి  అహాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అది నిజమైనా,  అది మంచి విషయం అయినా దాన్ని అస్సలు అంగీకరించరు.  ఈ చిన్న ఇగో కాస్తా క్రమంగా విభేదాలకు,  దూరానికి కారణమవుతుంది. కొంతమంది ఎప్పుడూ తాము ఇతరులకన్నా గొప్పవారిగా భావిస్తారు.   వారి మాటలే ఫైనల్ అంటుంటారు. అలాంటి మనస్తత్వం రిలేషన్స్ లో  చేదు అనుభవాలను తెస్తుంది. బంధాలు కొనసాగాలి అంటే అహాన్ని పక్కన పెట్టడం,  అవతలి వ్యక్తి స్థానాన్ని అర్థం చేసుకోవడం, చిన్న విషయాలను విస్మరించడం చాలా ముఖ్యం.  ఈ చిన్న మార్పు పెద్ద వివాదాలను నిరోధించగలుగుతుంది. ఇతరులను మార్చకండి.. రిలేషన్స్ లో అయినా ఇతర విషయాలలో అయినా చాలా మంది తమ సమయాన్ని, శక్తిని ఎదుటి వ్యక్తిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతారు. కానీ నిజం ఏమిటంటే ఇతరుల  స్వభావాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మనం ఇతరులను మార్చడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తామో, అంతగా నిరాశ చెందుతాము. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా  ఉండేవారు సమస్యలకు సులభంగా పరిష్కారాలను కనుగొంటారు. చాలా పాజిటివ్ గా,  సంతోషంగా ఉన్న వ్యక్తులు ఒత్తిడి, నిరాశ, అధిక రక్తపోటు,  ఆందోళన వంటి సమస్యలను రాకుండా చూసుకోగలుగుతారు.  అందుకే ఇతరులను మార్చడం కంటే మనలో మార్పు కోసం కృషి చేయడం తెలివైన పని. పాజిటివ్ గా ఉండాలి.. ఏ సంబంధం కూడా పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. మనం ఇతరుల కోణం నుండి  విషయాలను అర్థం చేసుకోకపోతే చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి.  అంచనాలు ఉన్నప్పుడు ఇతరులలో  తప్పులను వెతకుతుంటాము. ఇది  అసంతృప్తికి గురిచేయడమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో.. అప్పుడు పరిస్థితులు కూడా పాజిటివ్ గా కనిపిస్తాయి.  మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తులు శారీరకంగా,  మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఆత్మ పరిశీలన.. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు.. అలాగే ఎవరూ అన్ని విషయాలలో కరెక్ట్ గా ఉండరు. మన బలహీనతలు, తప్పులు,  తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం.  మొదట మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడం,  మన లోపాలను అంగీకరించడం చాలా అవసరం. మన మనస్సును,  తెలివితేటలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. మనం మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుంటే మన తప్పులను అంగీకరించడం సులభం అవుతుంది. ఎవరికి వారు మారితే  ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది.  జీవితాన్ని మరింత సమతుల్యంగా చేస్తుంది. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మనస్సు,   సంబంధాల మధ్య సామరస్యం, మనలో సానుకూల మార్పులు చేసుకోవడం..  ఇవన్నీ  సంతోషకరమైన జీవితానికి మొదటి అడుగు అవుతాయి.   కాబట్టి జీవితం బాగుండాలంటే.. ఎవరి జీవితం వారికి బాగుండాలంటే పైన చెప్పుకున్న మార్పులు వచ్చే విధంగా కొత్త ఏడాదిలో ఒక లక్ష్యం పెట్టుకుని వాటికి అనుగుణంగా మారాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు.                             *రూపశ్రీ.
“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                             ◆నిశ్శబ్ద.
  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది! అని చెబుతుంటారు తల్లిదండ్రులు. మంచిగా చదువుకుంటే నలుగురూ గౌరవిస్తారు అని హెచ్చరిస్తుంటారు శ్రేయోభిలాషులు. చదువుకుంటే విచక్షణ, విజ్ఞానం అలవడతాయి అని ఊరిస్తుంటారు పెద్దలు. కానీ బాగా చదువుకోండి నాయనా, మీకు గుండెపోటు రాకుండా ఉంటుంది అని చెబుతున్నారు పరిశోధకులు.   భారీ పరిశోధన ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశమే కావచ్చు. కానీ అక్కడ గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. అక్కడ ప్రతి 27 నిమిషాలకీ ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. పరిస్థితి ఇలా అదుపు తప్పిపోవడంతో, గుండె ఆరోగ్యానికి సంబంధించి అక్కడ ఓ భారీ పరిశోధన మొదలైంది. ఇందులో భాగంగా 2,67,153 మంది ఆరోగ్యాలను పరిశోధకులు గమనించారు. వీరంతా కూడా 45 నుంచి 64 ఏళ్ల వయసువారే!   డిగ్రీ - గుండెపోటు డిగ్రీ చదివినవారితో పోలిస్తే, హైస్కూలుతో చదువుని ఆపేసినవారు గుండెపోటుకి లోనయ్యే ప్రమాదం ఎక్కువని పరిశోధనలో తేలింది. వీరు గుండెపోటుకి లోనయ్యే అవకాశం, ఏకంగా 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఇక ఇంటర్మీడియట్‌ చదువుని ముగించినవారేమో దాదాపు 70 శాతం ఎక్కువగా గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు.   ఇవీ విశ్లేషణలు చదువుకీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా తేలిపోవడంతో... అందుకు కారణం ఏమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటంతో పోషకాహారాన్ని, మెరుగైన వైద్యాన్ని స్వీకరించే అవకాశం ఉంది. ఇక చదువు వల్ల ఆరోగ్యపు అలవాట్ల మీద, రకరకాల వ్యాధుల మీదా ఓ అవగాహన ఏర్పడే సౌలభ్యం ఎలాగూ ఉంటుంది.   ప్రయోగం వల్ల ఉపయోగం ఈ పరిశోధన ద్వారా చిన్నిపిల్లలకైతే  ‘బాగా చదువుకోండిరా బాబూ! మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయట’ అని చెప్పగలం. కానీ ఓ నలభై ఏళ్లు దాటినవారికి ఏం చెప్పాలి. అందుకనే ఈ పరిశోధన లక్ష్యం చదువు ఆవశ్యకత గురించి చెప్పడమే కాదు. చదువుకోనివారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువని తేలితే... వారిలో తగిన అవగాహననీ, వైద్య సదుపాయాలనీ కల్పించే ప్రయత్నం చేయడం.     - నిర్జర.
మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో  శరీరం వెచ్చగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. సరైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.చాలామంది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నువ్వులు, అవిసె గింజలు తినడానికి ఆసక్తి చూపుతారు. చాలామంది వీటిని లడ్డులుగా చేసుకుని తింటుంటారు.  ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం,  పోషకాలతో మెరుగ్గా ఉంటాయి.  ఆరోగ్యకరమైన ఆహారాలుగా కూడా పరిగణింపబడతాయి. అయితే ఈ లడ్డులను తయారు చేసుకుని తినేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు ఆహార నిపుణులు.  నువ్వులు, అవిసె గింజలు లాంటి పదార్థాలను తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.  లేకపోతే చాలా నష్టం చూడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. శీతాకాలంలో ఆరోగ్యకరమైన లడ్డులు తినడం ఒక ట్రెండ్. కానీ చాలామంది మొదట రుచికి, తరువాత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే లడ్డులు తయారుచేసినప్పుడల్లా రుచి  కంటే  ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసమే వాటిని తింటున్నామని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. చలికాలంలో నువ్వులు,  అవిసె గిండలతో  చేసిన లడ్డులు రోజుకు ఒక చిన్న లడ్డూ సరిపోతుంది. దీని కంటే ఎక్కువ అవసరం లేదు. ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో  తినడం మంచిది.  సాయంత్రం స్నాక్‌గా కూడా ఆస్వాదించవచ్చు. రాత్రిపూట వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట వాటిని తినకుండా ఉండటం మంచిది. ఒకే రకమైన లడ్డూ తినడం కంటే.. 3-4 రకాల లడ్డూలను తయారు చేసి, ఒక్కొక్క సారి ఒక్కొక్కటి తినడం మంచిది.   ఇవి ఆరోగ్యకరమైనవి. చాలామంది అన్ని రకాల  విత్తనాలు కలిపి లడ్డులు చేస్తుంటారు. ఇది మంచిది కాదు. ఈ లడ్డులను  తీసుకునేటప్పుడు పాలు తాగాల్సిన అవసరం లేదు. లడ్డులు  సులభంగా జీర్ణమైతేనే తీసుకోవాలి. వాటిని తిన్నప్పుడు జీర్ణసంబంధ సమస్యలు వచ్చినా,  గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వచ్చినా వాటిని తీసుకోకపోవడం మేలు. పిల్లలు,  వృద్ధులు నువ్వులు, అవిసె గింజలతో చేసిన  లడ్డులను తినకూడదు. ఎందుకంటే వారిలో   జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ రకమైన లడ్డులు   తినకూడదు. ఈ తప్పులు చేయకూడదు.. లడ్డులను కట్టడానికి పెద్ద మొత్తంలో నెయ్యిని ఉపయోగిస్తారు. దీని వల్ల వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల లడ్డు ఆరోగ్యంగా మారుతుంది, కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా దీనిని తినవచ్చనుకుంటారు. కానీ  చక్కెర స్థాయి అదుపులో లేనప్పుడు ఈ లడ్డులను తినడం మంచిది కాదు. తీవ్రమైన కాలేయం,  మూత్రపిండాల రోగులు ఈ లడ్డులను  వైద్యులు  లేదా డైటీషియన్‌ను సంప్రదించకుండానే తీసుకోకూడదు. ఈ లడ్డులను స్నాక్స్ గా చిరుతిండిగా తీసుకుంటారు. కానీ వీటిని స్నాక్స్ పేరుతో ఎక్కువ తినడం కంటే ఇవి శరీరానికి ఒక మంచి మెడిసిన్ అనుకుని తీసుకుంటే మంచిది. లడ్డులను ఇంట్లోనే తయారు చేసుకుని తినడం మంచిది. బయటి లడ్డుల తయారీలో కల్తీ పదార్ధాలు వాడే అవకాశం ఎక్కువ. ఇంట్లో ఈ లడ్డులు తయారు చేసేటప్పుడు పాలను కలపడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి పాలను వాడకపోవడం మంచిది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...