పయ్యావుల పద్దు.. కేటాయింపులు ఇలా..
Publish Date:Feb 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్.. ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రాధాన్యతలను బట్టి నిధులు కేటాయించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమతూకంగా నిధుల కేటాయింపులు చేశారు. వివిధ రంగాలకు, పథకాలకు ఆయన తన బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
• పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు కేటాయింపు
•రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
•విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
•రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు
•పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
•సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు
•వీబీ జీ రామ్ జీకి.. రూ.8365 కోట్లు
•గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
•ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు
•జల్ జీవన్‌కు రూ.4,000 కోట్లు
•స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు
•విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు.. ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు
•రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30,000 కోట్లు
• ఎన్టీఆర్ భరోసా - రూ.27,719 కోట్లు
•దీపం 2.0 - రూ.2,601 కోట్లు
• వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు - రూ.2,320 కోట్లు
• స్త్రీశక్తి - రూ.1,420 కోట్లు
• బలహీన వర్గాలకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు
• ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు
• తల్లికి వందనం – రూ.9,668 కోట్లు
• స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు
• ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు
• సమగ్ర శిక్ష – రూ.2,946 కోట్లు
• ఉన్నత విద్య – రూ.2,566 కోట్లు
• డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ.2,161 కోట్లు
• మన బడి, మన భవిష్యత్ – రూ.1,500 కోట్లు
• నైపుణ్యాభివృద్ధి – రూ.1,232 కోట్లు
• పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ.707 కోట్లు
• సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర – రూ.654 కోట్లు
• యువత, క్రీడలు – రూ.438 కోట్లు
• మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు
• అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు
• రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు
• ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు
• మత్స్యకార సేవలో – రూ.260కోట్లు
• పంటల బీమా – రూ.250 కోట్లు
• పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు
http://www.teluguone.com/news/content/allocations-in-payyavula-budget-36-214075.html





