పశ్చిమాసియాలో శాంతి తక్షణావసరం.. విదేశాంగ మంత్రి జైశంకర్

Publish Date:Apr 11, 2026

Advertisement

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, అక్కడ తక్షణమే శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సదస్సులో పాల్గొనేందుకు మారిషస్ పర్యటనలో ఉన్న ఆయన, అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లపై మాట్లాడారు. యుద్ధ వాతావరణం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై భారత్ తన నిరసనను వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం   మంచిది కాదన్నారు. పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే దాడులను భారత్ ఎప్పుడూ ఖండిస్తుందని, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో భాగంగా జైశంకర్ కేవలం సదస్సుకే పరిమితం కాకుండా, వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నేపాల్, భూటాన్, సీషెల్స్ వంటి దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ అయి, ఆయా దేశాలతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ప్రాంతీయ భద్రత, సహకారంపై కీలక చర్చలు జరిపారు.

 అంతర్జాతీయ నౌకాయాన భద్రతపై జపాన్ విదేశాంగ మంత్రితో కూడా జైశంకర్ ఫోన్లో సంభాషించారు. హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో భద్రతా పరమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.  

ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడమే కాకుండా, సరఫరా గొలుసు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉద్రిక్తతలు సడిలేందుకు భారత్ చొరవ తీసుకుంటోందన్న సంకేతాలను ఇచ్చాయి.  

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.