Publish Date:Feb 10, 2026
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అరెస్టునకు రంగం సిద్ధమౌతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఆయనకు జైలు తప్పదా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఔనన్న సమాధానమే వచ్చేటట్టున్నది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక మలుపు తిరిగింది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏపీ సీఎం చేసిన ఆరోపణలు అవాస్తవమని సిట్ తేల్చిందంటూ వైసీపీ నానా హడావుడీ చేస్తుంటే.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం సిట్ నివేదికలో నెయ్యికల్తీ విషయం స్పష్టంగా ఉందని కుండబద్తలు కొట్టారు.
వైసీపీ వాదన శుద్ధ తప్పనీ, దుష్ప్రచారం మాత్రమేననీ తేల్చేస్తూ జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. దీంతో తప్పు ఒప్పుకున్న వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్ ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. అంతే కాకుండా వైవీ సుబ్బారెడ్డి తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ నిజమేనని చెప్పడం ద్వారా వైసీపీ నేతల నోళ్లు మూయించేశారు. వైవీ అంత స్పష్టంగా కల్తీ వాస్తవమేనని చెప్పడంతో నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇక అధికారపక్షాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది.
అదలా ఉంచితే.. వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో, తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం తనకు తెలుసునని కూడా అంగీకరించారు. అంటే తెలిసి తెలిసీ కల్తీని ప్రోత్సహించానని ఆయన పరోక్షంగా అంగీకరించేశారు. ఆ కల్తీలో జంతువుల కొవ్వు లేదని ఆయన చెప్పినప్పటికీ.. కల్తీ జరిగిందని అంగీకరించడం, అదీ తనకు తెలిసే జరిగిందని చెప్పడంతో ఆయన ఇక తప్పించుకోలేని విధంగా ఇరుక్కున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ జోరందుకుంది. అన్నిటికీ మించి వైవీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉణ్న సమయంలో ఆయన తన లెటర్ హెడ్ పై ఇచ్చిన ఫోన్ నంబర్, చిన్నప్పన్న నంబర్ ఒక్కటేనని తేలడంతో నెయ్యి కల్తీ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డికి ప్రమేయం ఉందన్న అనుమానాలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు అనివార్యం అన్న భావన పరిశీలకులలో కూడా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/adultrated-ghee-in-tirumalaladdu-prasadam-case-36-213816.html
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.