Publish Date:Feb 10, 2026
రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తాజాగా జరిగిన మంత్రులు- కార్యదర్శుల సమావేశం సందర్భంగా విడుదల చేసిన నివేదికలో రాజధాని అమరావతిలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన అంశాలపై ప్రభుత్వ కృషిని వివరించారు. అమరావతిలో 41 కంపెనీలు రాబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆయా కంపెనీలు రూ. 48,711 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. 41,625 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని నివేదిక చెబుతోంది.
ఇప్పటికే మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండిగ్స్(ఎంఓయూ)లు పూర్తయిపోయాయి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోద ముద్ర కూడా వేసిందని నిదేదిక పేర్కొంది. రాజధాని అమరావతిలో రూ.4,700 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 4,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు.
ఇందుకు సంబంధించి భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాగా అమరావతిలో ఇప్పటి వరకూ 9 జాబ్ మేళాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో 7 జాబ్‌మేళాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 9 జాబ్ మేళాలు నిర్వహించారు. వీటిలో 580 కంపెనీలు పాల్గొన్నాయి. వీటి ద్వారా 5,984 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు నివేదిక తెలుపుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/41-new-companies-in-amaravati-36-213814.html
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు.
అమ్మాయి తరపు వారు పది మంది ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. యువన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిందితులు ఒక్కసారిగా యువన్ పై కత్తులతో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే తల, మెడ, చేతులపై విచక్ష ణారహితం గా కత్తులతో దాడి చేయడంతో యువన్ అక్కడికక్కడే కుప్పకూ లిపోయాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. మిచెల్ మార్ష్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు.