ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను లోతుగా విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కీలక అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంటూ, వంశీ మోహన్‌ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలపై ఏసీబీ అధికారులు వంశీ మోహన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆస్తులు, ఆర్థిక లావాదే వీలు, పెట్టుబడులు, ఇతర సంబంధిత అంశాలపై మరింత సమా చారం సేకరించాల్సి ఉందని ఏసీబీ కోర్టుకు తెలిపింది.
ఏసీబీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, వంశీ మోహన్ తరఫు న్యాయవాదులను కౌంటర్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కస్టడీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-seeks-custody-of-deputy-collector-vamsi-mohan-36-221757.html
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.