దేవాన్ష్ పేరుతో పుష్కర ఘాట్... లోకేశ్ సీరియస్

Publish Date:Jun 6, 2026

Advertisement

 

టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు. ఏపీలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఓ ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై  లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తూ, ఆ పేరును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

 ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి తగవని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం మునికూడలిలో గోదావరి పుష్కరాల కోసం ఘాట్‌ను సిద్ధం చేస్తున్నారు.  రాజానగరం నియోజకవర్గంలోని గౌతమీ, వశిష్ట, లక్ష్మీ నదుల పవిత్ర సంగమమైన 'మునికూడలి' వద్ద  ఘాట్‌ను సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 

ఆ ఘాట్‌కు 'దేవాన్ష్ ఘాట్' అని పేరు పెట్టారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘాట్‌ను పరిశీలించిన సమయంలో అక్కడ దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యుడి పేరు పెట్టడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అది లోకేశ్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఏ ఘాట్‌కు కూడా దేవాన్ష్ పేరు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

By
en-us Political News

  
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.