ఆవేశం కాదు...అవగాహనే కుటుంబ బంధాలకు బలం : డీజీపీ సీవీ ఆనంద్

Publish Date:Jun 6, 2026

Advertisement

 

 

దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..

కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విభేదాలు, వాటి కారణంగా చోటుచేసుకుంటున్న విడాకులు, హత్యలు, ఆత్మహత్యలు వంటి విషాద ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంటీరియల్ గార్డెన్‌లో సీపీ సుమతి ఆధ్వర్యంలో “కలిసి ఉంటే కలదు సుఖం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, సీఐడీ డీజీ చారు సిన్హా కూడా పాల్గొన్నారు.

మహిళల భద్రత కోసం చేపడుతున్న “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో భరోసా కేంద్రాల సహాయంతో తిరిగి కలిసిన దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుని మళ్లీ కలిసి జీవనం సాగిస్తున్న జంటలు తమ అనుభవాలను సభలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైందని పేర్కొన్నారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు సహజమేనని, అయితే ఆవేశంలో మాట్లాడే మాటలే పెద్ద సమస్యలకు దారితీస్తాయని అన్నారు.

“గొడవ జరిగిన సమయంలో క్షణిక ఆవేశానికి లోనుకాకుండా కొంత సమయం మౌనం పాటించడం చాలా సందర్భాల్లో సమస్యలను తగ్గిస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మాటల వల్లే అనేక గొడవలు పెద్దవిగా మారుతాయి” అని డీజీపీ సూచించారు.

తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కొంతసేపు మౌనం పాటించి, బయటకు వెళ్లి ప్రశాంతంగా ఆలోచించే అలవాటు ఉందని ఆయన తెలిపారు. మహిళల భద్రత, కుటుంబ వ్యవస్థ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ స్పష్టం చేశారు. కుటుంబ తగాదాల కారణంగా విడిపోయిన దంపతులను భరోసా కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ చేసి మళ్లీ కలిపే ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

“కలిసి ఉంటే కలదు సుఖం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా దంపతులు పరస్పర అవగాహన, సహనం, సంభాషణల ద్వారా కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అధికారులు సూచించారు. కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుందనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.


 

By
en-us Political News

  
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.