జగన్ క్రెడిట్ చోరీకి ఉండవల్లి మాటసాయం.. ఏమన్నారంటే?

Publish Date:Sep 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ మరో సారి చర్చనీయాంశంగా మారింది.  పోలవరం ప్రాజెక్టుపై  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్   తాజాగా చేసిన వ్యాఖ్యలు రగడ రేపుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ క్రెడిట్ వార్ కు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ క్రెడిట్‌  ను ఉండవల్లి తన వ్యాఖ్యల ద్వారా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి క్రెడిట్ లో వేయడానికి ఉండవల్లి ప్రయత్నించారు.   పోలవరం పేరు చెబితే ఎవరికైనా గుర్తుకు వచ్చేది   దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఉండవల్లి అన్నారు.  ఎవరెంత ప్రయత్నించినా, ఎంత తపస్సు చేసినా ఈ సత్యాన్ని మార్చలేరంటూ ఉండవల్లి పరోక్షంగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  

ఇక ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం, నిర్దుష్ట కాల వ్యవధిలో పూర్తి కావడం తధ్యమన్న అంచనాల నేపథ్యంలో జగన్ కు మద్దతుగా ఉండవల్లి మీడియా ముందుకు వచ్చారు.  పోలవరం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వచ్చిన ప్రజా సానుకూలతను తగ్గించేందుకు శతధా ప్రయత్నించారు. అంటే పోలవరం అంటే వైఎస్ మాత్రమే గుర్తుకు వస్తుంటారు అని వ్యాఖ్యానించడం ద్వారా వైసీపీకి పోలవరం పురోగతిని అనుకూలంగా మార్చేందుకు ఉండవల్లి ప్రయత్నించారన్న మాట. 

అయితే.. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను పడుకోపెట్టేసిన విషయాన్ని ఉండవల్లి ఇక్కడ కన్వీనియెంట్ గా మార్చిపోయారు. అంతేనా ఉండవల్లి జగన్ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఇసుమంతైనా కనిపించదు. ఉదాహరణకు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి ఉండవల్లి ఎన్నడూ మాట్లాడలేదు. జగన్ హయాంలో చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రాజమహేంద్రవరం జైలు వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. కానీ అక్రమమద్యం కేసులోఅరెస్టైన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును తప్పుపట్టడమే కాకుండా, రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మరీ ఆయనను పరామర్శించి వచ్చారు.    

ఇక పోలవరం విషయానికి వస్తే.. జగన్ హయాంలో ఆయన సర్కార్ నిర్వాకం కారణంగా  డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి..  ఖజానాపై   3 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించిన పాపాన పోలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలవరం పనులను పరుగులెత్తిస్తూ.. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంటే.. ఉండవల్లికి క్రెడిట్ వైఎస్ కు.. తద్వారా జగన్ వైసీపీకీ దక్కకుండా పోతోందన్న భయం, బెంగ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే హడావుడిగా పోలవరం అంటే వైఎస్ గుర్తుకు వస్తారనీ, వైఎస్ అంటే పోలవరం గుర్తుకు వస్తుందనీ చెబుతూ తగుదునమ్మా అంటూ జగన్ క్రెడిట్ వార్ కు మద్దతు పలుకుతున్నారు.  

ఈ వార్త కూడా చదవండి: https://teluguone.com/news/prevsingle/not-undavalli-he-is-chameleon--39-192665.html

 గతంలో ఇదే పోలవరం గ్యాప్ 2 ఆనకట్ట నిర్మాణంలో  సాంకేతిక వ్యత్యాసాలు ఉన్నాయనీ,  డిజైన్ ఆమోదాలు లేకుండా పనులు ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో ముప్పు ఎదురౌతుందంటూ ఇదే ఉండవల్లి  సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ  రాశారు.  ఇలా సాంకేతిక అంశాల ప్రస్తావిస్తూ ఒక వైపు పోలవరంపై విషం కక్కుతూనే.. మరో వైపు, ఇదే పోలవరం రాజకీయంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి లబ్ధి చేకూరుస్తుందన్న దుగ్ధతో జగన్ క్రెడిట్ చోరీ యత్నాలకు మద్దతు పలుకుతూ ఉండవల్లి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుంటున్నారు.  


 [Undavalli Arun Kumar on Polavaram Project, Coalition Government, Chandrababu Naidu, YS Rajasekhara Reddy, AP Politics, Telugu One]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.