జీ టీవీ పై జిందాల్ స్టింగ్ ఆపరేషన్
posted on Oct 26, 2012 12:17PM
.jpg)
కోల్ గేట్ స్కామ్ వివరాల్ని బైటపెట్టకుండా ఉండేందుకు జిందాల్ కంపెనీని జీటీవీ వంద కోట్లు డిమాండ్ చేసిందట. జిందాల్ ఈ విషయాన్ని స్వయంగా బైటపెట్టారు. జీ టీవీ బ్లాక్ మెయిల్ ప్రహసనాన్ని రికార్డ్ చేసిన టేపుల్ని విడుదల చేసిన జిందాల్ ప్రముఖ చానెల్ మీదు దుమ్మెత్తి పోస్తున్నారు. మరో వైపు జీటీవీ మాత్రం తాము డబ్బడగలేదని, తెలిసిన వివరాల్ని బైటపెట్టకుండా ఉండేందుకు వంద కోట్ల రూపాయలు లంచంమిస్తామంటూ జిందాల్ ప్రతినిధులు తమని సంప్రదించారని చెప్పుకుంటోంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది నిలకడమీద తేలాల్సిందే. కానీ.. జిందాల్ చెబుతున్నది గనక నిజమైతే.. మీడియాపైనే స్టింగ్ ఆపరేషన్ చేసిన ఘనతని ఆ కంపెనీ దక్కించుకున్నట్టే.. జిందాల్ ప్రతినిధులకూ, జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరి, బిజినెస్ ఎడిటర్ సమీర్ అహ్లూవాలియాలకూ మధ్య జరిగిన సంభాషణల్ని రికార్డ్ చేసిన జిందాల్ కంపెనీ ప్రతినిధులు.. వాటిని మీడియాకి విడుదల చేశారు.