ఇంటర్ విద్యార్ధినిని రేప్ చేసిన డాక్టర్
posted on Oct 26, 2012 12:04PM
.jpg)
ఢిల్లీ పహర్ గంజ్ లో ఈ దారుణం జరిగింది. విదేశాల్లో వైద్య విద్యకి సంబంధించిన సీటిప్పిస్తానంటూ అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఓ డాక్టర్ బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. నిజమేనని నమ్మింది. కాన్సొలేట్ అధికారిని కలవడానికి వెళ్దామని చెప్పి ఓ హోటల్ కి తీసుకెళ్లాడు. అదేమని అడిగితే కాన్సులేట్ అధికారులు బైట కలవరు, పెద్దపెద్ద హూటళ్లలోనే వాళ్లతో మాట్లాడాలి అని చెప్పాడు. తను నిజమేనని నమ్మేసింది. కాన్సులేట్ అధికారిని కలిసొస్తానని ఇంట్లో చెప్పి డాక్టర్ తో వెళ్లింది. పథకం ప్రకారం బాధితురాలిని వంచించిన డాక్టర్.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమె స్పృహకోల్పోగానే అత్యాచారం జరిపాడు. మెలకువ వచ్చిన తర్వాత.. ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరించాడు. బెదిరిపోయి ఇంటికెళ్లిన పిల్ల వాలకాన్ని చూసి తల్లికి అనుమానమొచ్చింది. అక్కున జేర్చుకుని అడిగితే బిడ్డ భోరుమంది. తమకు జరిగిన అన్యాయం గురించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.