ముక్క‌లుగా న‌రికి.. పాతేసి.. ప‌ల‌మ‌నేరులో ప‌రువుహ‌త్య‌..

ప్రేమ ఇది ఏమైనా అంటరాని సంబంధమా..? అక్రమ సంబంధం కంటే దారుణమైనదా..? ప్రేమిస్తే పిల్లలను చంపేస్తారా..? అసలు పరువు అంటే ఏంటి..? ఆ పరువు కోసం మరొకరి నిండు ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉంది. మరి ప్రేమ ముసుగులో యువతీ యువకులు చేసే పనులు ఏంటి..? ప్రేమికులు స్వేచ్ఛగా పెళ్ళిచేసుకుని రోజులు ఎప్పుడు వస్తాయి. ప్రేమకు కులం, మతం, డబ్బు ఈ మూడు కొలమానాలా.. ప్రేమించుకున్న వాళ్ళను అవసరం అనుకుంటే కూర్చోబెట్టి మాట్లాడి విడదియ్యాలి గానీ, అసలు చంపడమేంటి. తాజాగా తన  కుమార్తెను ప్రేమించాడని..ఆ యువకుడ్ని ముక్కలుగా నరికాడు ఓ తండ్రి.. 

వివరాలు ఇలా.. 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ధనశేఖర్‌ (23) అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్‌ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.   

డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి బాబు తమ కుమారుడిని నరికి చంపాడని ధనశేఖర్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బాలిక తండ్రి కాల్‌డేటాను పరిశీలించారు. శనివారం రాత్రి 10గంటలకు బాలిక తండ్రి నుంచి ధనశేఖర్‌కు ఫోన్ కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో బాబును అరెస్ట్‌ చేసి విచారించగా.. శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్‌ ఉండటాన్ని చూశానని చెప్పారు. ధనశేఖర్‌ను కత్తితో నరికినట్లు బాలిక తండ్రి ఒప్పుకున్నాడు. గ్రామ శివారులోని బావిలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. సోమవారం బావిలో మృతదేహం తేలడాన్ని బాబు గమనించాడు. దీంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి పొలంలో పాతిపెట్టాడు. నేరం ఒప్పుకోవడంతో బాలిక తండ్రిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ చెప్పారు.  

మానవతావన్ని మరిచి పోతున్నారు. అడవిలో మృగాలకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మానవుడు అనే పదానికి అర్థాన్ని మూర్ఖుడుగా మారుస్తున్నారు. కూతుర్ని ప్రేమించాడని హత్యలు చేస్తున్నారు. ఒక్కటి కాదు రేడు కొన్నీ వందల హత్యలు జరిగాయి. తెలంగాణాలో మంథాని, భువనగిరి సంఘటన, ప్రణయ్ అమృతాల ఘటన ఇలా చెపుతూపోతే వందలకు పైగా ఉన్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu