Mega 158: చిరంజీవి కొత్త సినిమాకి ఊహించని టైటిల్!
on Jan 24, 2026

'మన శంకర వరప్రసాద్ గారు' హిట్ తో జోష్ లో చిరంజీవి
బాబీ దర్శకత్వంలో తదుపరి చిత్రం
త్వరలోనే షూటింగ్ ప్రారంభం
టైటిల్ లాక్ చేసిన మేకర్స్!
ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)తో ప్రేక్షకులను పలకరించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ ఉత్సాహంతో తన నెక్స్ట్ మూవీని మొదలు పెట్టనున్నారు చిరంజీవి.
బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమా చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు.. టైటిల్ వేటలో ఉంది టీమ్. ప్రస్తుతం 'కాకా', 'కాకాజీ' అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట. ఈ రెండు టైటిల్స్ లో 'కాకా' టైటిల్ కి ఎక్కువమంది మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశముంది. (Mega 158)
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు బాబీ తన టీమ్ తో కలిసి దుబాయ్ వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Also Read: రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
నటీనటులు కూడా ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. చిరంజీవి భార్యగా ప్రియమణి, కూతురుగా కృతి శెట్టి కనిపించనున్నారట. అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించనున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో అలరించనున్నారని వినికిడి.
'మెగా 158' సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి.. వచ్చే సంక్రాంతికి కూడా ఇదే రిజల్ట్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



