అమెరికాలో మరో జాత్యహంకార దాడి..
posted on Apr 13, 2017 10:28AM

అమెరికాలో జాత్యహంకార దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మందిపై దాడులు జరగగా..ఇప్పుడు ఓ ముస్లిం మహిళ బలైంది. వివరాల ప్రకారం.. అమెరికాలోని వాషింగ్టన్ లో ఓ మహిళ మసీదులో ప్రార్థన ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా...అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి ఆమె పక్క ఆగింది. కారులోంచి ఓ అగంతకుడు కిందకి దిగి.. ఆమెను హిజాబ్ (బురకా) తీసివేయాలని ఆదేశించాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆమెను కిందపడేసి విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోగా..ఆ మహిళ హిజాబ్ ను అతను తొలగించి, ఫుట్ పాత్ పై ఆమెను పడేసి, ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తరువాత అటుగా వెళుతున్న కొంతమంది ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.