వైసీపీ ఎంపీలకు థ్యాంక్స్...టీడీపీ ఎంపీలకు చురకలు..

 

ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఏపీ ఎంపీలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీకి ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. కేకే, రాపోలు ఆనందభాస్కర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.. హోదాపై వైసీపీ ఎంపీలు గట్టిగానే పోరాడుతున్నారు.. దయచేసి టీడీపీ ఎంపీలు ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టద్దు అని సూచించారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu