కొత్త కష్టంలో ములాయం..
posted on Apr 12, 2017 5:54PM
.jpg)
ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయి..కుటుంబ విబేధాలతో ఇబ్బందులు పడుతున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను బెదిరించినట్లు గతంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసులో భాగంగా ఠాకూర్ ను ఆయన బెదిరించింది నిజామా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ముందడుగు వేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలో ములాయం స్వరానికి సంబంధించి నమూనాలు సేకరించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా అక్రమాస్తులు పోగేశారని ఆరోపిస్తూ గాయత్రి ప్రజాపతిపై లోకాయుక్తలో ఠాకూర్, ఆయన సతీమణి నూతన్ ఠాకూర్ పిర్యాదు చేయగా.. దీనిపై ములాయం వారిని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి.