వర్ష వాడిన పిస్టల్ పై వీడుతున్న మిస్టరీ
posted on Oct 11, 2012 10:47AM


ఆశా భోంస్లే కూతురు వర్షాభోంస్లే ఆత్మహత్యకి వాడిన పిస్టల్ ఎవరిదన్న విషయంలో దర్యాప్తు కాస్త ముందుకు సాగింది. బెల్జియంలో తయారైన పిస్టల్ ని స్పాట్ నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆశా కొడుకు ఆనంద్ పేరుమీద ఆ పిస్టల్ రిజిస్టరైఉంది. చాలాకాలం క్రితం తాను ఆ పిస్టల్ ని కొన్నానని, ఎక్కడో దాచిపెట్టిన పిస్టల్ చాలాకాలంగా కనిపించడంలేదని, అది తన కూతురికి ఎలా దొరికిందో తెలీదని ఆశా భోంస్లే చెప్పడంతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయ్. పిస్టల్ నిజంగా ఆశాభోంస్లేదే అయితే చిన్నకొడుకు ఆనంద్ పేరుమీద ఎందుకు రిజిస్టరై ఉందన్నది మొదటి అనుమానం. చాలాకాలం క్రితం కనిపించకుండా పోయిందని చెబుతున్న పిస్టల్ వర్ష చేతిలో ఎలా పడిందన్నది రెండో అనుమానం. ఇలా తవ్వుకుంటూ పోతే మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయని ముంబై వాసులు అనుకుంటున్నారు. పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్తున్నారు. వర్ష చాలా దగ్గరినుంచి కాల్చుకోవడంవల్ల బ్రెయిన్ హెమరేజ్ వచ్చి, విపరీతంగా రక్తంపోయి చనిపోయిందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ చెబుతోంది.