రైతుబాట పట్టిన చంద్రబాబు
posted on Oct 11, 2012 10:43AM

గతంలో తాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్రలో రైతుల్ని ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తానని, రైతుల పక్షాన నిలుస్తానని హామీలిస్తున్నారు. అరవై ఏళ్ల వయసులో చంద్రబాబు దూకుడుని చూసి చూడ్డానికొచ్చినవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. రైతుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ లో ఓ విధానాన్ని రూపొందిస్తానని చెబుతున్న చంద్రబాబు మిగతా వర్గాలకు కూడా వరాలమీద వరాలను కురిపిస్తానని మాట ఇస్తున్నారు. వెయ్యిరూపాయల నిరుద్యోగ భృతి, పదిహేను వందలరూపాయల వికలాంగుల పింఛన్, అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రత్యేక ప్యాకేజీలు, ఏడాదికి పది సిలిండర్లు లాంటి వరాలను అందుబాటులోకి తెస్తానని గట్టిగా హామీ ఇస్తున్నారు.