సారీ చెప్పి యాత్ర చేసే దమ్ముందా?
posted on Oct 11, 2012 10:59AM
.jpg)
చంద్రబాబుకి పాదయాత్రలో లభిస్తున్న విస్తృత స్థాయి ప్రజాదరణని చూసి పిల్లకాంగ్రెస్ పార్టీ భయపడుతోందని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అందుకే షర్మిల పోటీగా మరో పాదయాత్రని ప్రారంభించబోతోందని ఆరోపిస్తున్నారు. నిజంగా జనంకోసం యాత్ర చేయాలనుకుంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఇడుపులపాయనుంచి షర్మిల తన యాత్రని మొదలుపెట్టాలని టిడిపి నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు. ఇడుపులపాయ పక్కనే ఉన్న దళితుల భూముల్ని ఆక్రమించికుని ఏళ్లపాటు అనుభవించినవాళ్లకు ప్రజలకోసం యాత్ర చేసే అర్హత లేదంటూ విమర్శించారు. షర్మిల భర్తకి ఖమ్మంజిల్లాలో వై.ఎస్ రాసిచ్చిన ఇనుప ఖనిజం భూముల్ని తిరిగి ప్రభుత్వానికి స్వాధీననం చేయాలని డిమాండ్ చేశారు. రక్షణ స్టీల్స్ కోసం ప్రజలకు చెందాల్సిన భూమిని రాయించుకోవడం తప్పేనని ఒప్పుకుని క్షమాపణ చెప్పాకే యాత్ర మొదలుపెట్టాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు.