నిద్రపోతున్నప్పుడు కాళ్లలో సిరలు పట్టేస్తున్నాయా? ఇదే కారణం..!

 

చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ సిరలు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. నరాలు ఉబ్బి చాలా నొప్పిని కలిగిస్తాయి.  నిద్రకు కూడా భంగం కలిగిస్తాయి. ఇది కొన్నిసార్లు జరగడం సాధారణం.  కానీ ఇది చాలా ఎక్కువగా   జరుగుతుంటే అది విటమిన్ లోపం  సంకేతం కావచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల సిరలు ఉబ్బుతాయో.. ఇది ఎందుకు జరుగుతుందో.. విటమిన్ల ప్రధాన పాత్ర ఏంటో.. తెలుసుకుంటే..

విటమిన్ల పాత్ర..

శరీర అభివృద్ధికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా నరాలు,  గుండె పనితీరుకు కూడా చాలా ముఖ్యమైనవి. విటమిన్ లోపం నరాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

విటమిన్ సి లోపం..

విటమిన్ బి12 తో పాటు, విటమిన్ సి లోపం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. నిజానికి విటమిన్ సి లోపం వల్ల రక్త కణాలు బలహీనపడతాయి. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి నారింజ, నిమ్మ, జామ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

ఇంటి చికిత్సలు..

ఐస్ కంప్రెస్..

నిద్రలో నరాలు ఉబ్బడం, పట్టేసినట్టు అవ్వడం,  నొప్పి కలిగించడాన్ని వెరికోస్ వెయిన్ అంటారు.  ఈ వెరికోస్ వెయిన్  నుండి తక్షణ ఉపశమనం పొందడానికి  కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.

వెరికోస్ వెయిన్ వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ భాగానికి ఐస్ కంప్రెస్ వేయవచ్చు. 3 నుండి 5 నిమిషాలు కంప్రెస్ వేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ఆయిల్ మసాజ్..

 అకస్మాత్తుగా నరాల నొప్పి వస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి అమ్మమ్మలు సూచించిన  ది బెస్ట్ ఇంటి నివారణను ఆయిల్ మసాజ్. నరాల నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది.

                       *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu