టీ ఇవ్వలేదని భార్యని చంపిన భర్త..

 

ఒకప్పుడు హత్య అంటే ఎంతో పెద్ద విషయంలాగా ఉండేవి.. ఒక మనిషిని.. మరో మనిషిని చంపాలంటే దానికి కారణం చాలా పెద్దదిగా ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో పరిస్థితి అలా లేదు. చాలా చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. కొన్ని హత్యలని చూస్తే, 'కారణం ఇదేనా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన హత్య గురించి విన్న ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో చూద్దాం..రాష్ట్రంలోని పౌరీ జిల్లాకు చెందిన సంగీత్ సింగ్ నేగీ (38), ఆర్తి (35) దంపతులకి పదమూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే నిన్న ఉదయం నిద్రలేచిన సంగీత్ సింగ్... తన భార్యను బెడ్ టీ ఇవ్వమని ఆర్డర్ వేశాడు. దానికి తాను టీ చేయనని చెప్పడంతో ఆగ్రహానికి గురైన సంగీత్ సింగ్...బెడ్ రూంలోకి కత్తులు, కత్తెర తీసుకెళ్లి భార్యను పిలిచాడు. బెడ్ రూంలోకి భార్య రాగానే, తలుపుకు గడియపెట్టి, కత్తులతో విచక్షణా రహితంగా ఆమెను పొడిచి చంపాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu