దిగొచ్చిన యునైటెడ్ ఎయిర్ లైన్స్...ప్రయాణికుడికి క్షమాపణలు..
posted on Apr 12, 2017 3:49PM

విమానం నిండిపోయిందన్న కారణంతో ఆసియా వాసి అయిన ఓ ప్రమాణికుడిని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. అంతేకాదు దీనిపై స్పందించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ క్షమాపణలు చెప్పమని తేల్చేసింది. కానీ ఆఖరికి చెప్పాల్సివచ్చింది. దీనికి కారణం..ఆ విమానయాన సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనమవ్వడమే. షేర్ మార్కెట్ ఇంట్రా ట్రేడింగ్ లో ఆ సంస్థ షేర్లు 3.7 శాతం పతనమైపోయాయి. దీంతో ఒక్కసారిగా కంపెనీ మార్కెట్ విలువ 800 మిలియన్ డాలర్లు (5,100 కోట్ల రూపాయలకు పైగా) పడిపోయింది. దీంతో దిగొచ్చిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ సదరు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది.