ఈ తలలు నరకడాలు ఏంటి ?
posted on Apr 12, 2017 12:51PM
.jpg)
రాజకీయ నేతలు అప్పుడప్పడు నోరు జారుతూనే ఉంటారు. అది కామన్. కానీ ఈ మధ్య బీజేపీ నేతలు ఈ నోరు జారడంలో అందరికంటే కాస్త ముందున్నారు అని చెప్పొచ్చు. వారి నోరి వెంట తలలు నరకడం అన్న మాట తప్ప మరో మాట వినిపించడం లేదు. ఇటీవల శ్రీరామ నవమి సందర్బంగా హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. రామమందిర నిర్మాణానికి అడ్డుపడినవారి తలలు నరికేస్తామని వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇంకా వాటి వేడి తగ్గకముందే మళ్లీ మరో బీజేపీ నేత నోరు జారి విమర్శలపాలయ్యాడు. అతనే బీజేవైఎం(భారతీయ జనతా యువమోర్చా) నాయకుడు యోగేష్ వార్ష్నే. ఈయన గారు ఏకంగా సీఎం తలనే నరికి తీసుకురావాలని పిలుపునిచ్చాడు. అసలు సంగతేంటంటే...
హనుమాన్ జయంతి సందర్బంగా బిర్భమ్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యోగేష్ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ.. నిర్వాహకులు వినిపించుకోకపోవడంతో.. ర్యాలీ చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికిగాను ఆగ్రహించిన యోగేష్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతాబెనర్జీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మమత మద్దతు ముస్లింలకేనని..ఇఫ్తార్ పార్టీలను మాత్రం మమత నిర్వహిస్తారని అన్నారు. అక్కడితో ఆగకుండా ‘సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ. 11లక్షల బహుమతి కూడా ఇస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మరి వీరి నోటికి ఎవరు తాళం వేస్తారో చూడాలి.