భారత్ కు గర్వకారణంగా నిలిచిన జవాను...


తనపై దాడి జరుగుతున్నా కానీ ఎదురుదాడికి దిగకుండా ఎంతో సహనం వహించి ఆదర్శంగా నిలిచాడు ఓ జవాను. అసలు సంగతేంటంటే.. శ్రీనగర్‌లో ఓ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాను పోలింగ్ పూర్తి చేసుకుని..ఎన్నికల సామాగ్రిని తీసుకువెళుతున్న అధికారులకు భద్రతగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్‌పై కశ్మీరీ యువత దాడి చేసింది. అయితే వారు దాడి చేస్తున్నా కానీ ఆ జవాను మాత్రం అతని దగ్గర తుపాకీ ఉన్నా ఎలాంటి ఎదురుదాడికి దిగకుండా.. నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే చేతిలో తుపాకి ఉన్నా మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా.. ఆ సమయంలో తన బ్యాగులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)లు ఉన్నాయని, వాటిని రక్షించే బాధ్యత తనపై ఉందని చెప్పి భారత్‌కు గర్వకారణంగా నిలిచాడు. ఈ మొత్తం తతంగాన్ని కశ్మీర్ యువత వీడియో తీసి దాని ద్వారా మరింత మందిని అరాచకం వైపు మళ్లీంచేందుకు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది ఇప్పుడు ఆ వీడియో ద్వారా భారత సైనికుల సహనం ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేసినట్లయ్యింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu