ఒక్క బ్రిడ్జి.. నాలుగు జిల్లాల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కష్టాలను తీర్చే విషయంపై దృష్టి పెట్టింది. ఇందుకు తాజా తార్కాణం విశాఖపట్నం, రాజాం రోడ్డులో నాలుగేళ్ల కిందట శిథిలావస్థకు చేరి రాకపోకలకు అనువుగా లేని బ్రిడ్జిని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే. ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో  వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ బ్రిడ్జి మూత వల్ల పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. రాజాం విశాఖల మధ్య దూరం కేవలం వంద కిలోమీటర్లే అయినప్పటికీ.. అదనంగా ఐదు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి.

 మూతపడిన బ్రిడ్జికి బదులుగా కొత్త బ్రిడ్జి నిర్మాణం ఆరంభమైనప్పటికీ పనులు చాలా చాలా నెమ్మదిగా సాగాయి. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రైల్వే శాఖతో సమన్వయం కారణంగా నిధుల సమస్య లేకుండా పోయింది. అంతే నిర్మాణం ఏడాది కాలంలో పూర్తయ్యింది. ఈ కొత్త బ్రిడ్జిని సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రారంభం కానుంది.  ఈ ఒక్క బ్రిడ్జితో  నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ అన్నట్లుగా ఎగిరిపోనున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu