పంచాయితీ భయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది!

 అక్రమ సంబంధం బయటపడకూడదని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. ఈ ఢటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వామి, మౌనికలకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే మౌనిక తనకన్నా వయస్సులో చిన్న వాడైన సంపత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం  ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన భర్త స్వామి పలుమార్లు ఆమెను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో  గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.  ఈ నేపథ్యంలోనే గత నెల 22న ఇంట్లో భర్త నిద్రపోతుండగా.. ప్రియుడు సంపత్ ను ఇంటికి పిలిచింది. ప్లాన్ ప్రకారం ఇరువురూ కలిసి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని నేరెళ్ల కుంటలో పడేశారు.  మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయాడు కట్టుకథ అల్లి అందర్నీ నమ్మించాలని ప్రయత్నించిన మౌనికకు స్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో మౌనిక నేరం ఒప్పుకుంది. ఆమెను, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్టు చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu