న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

 

జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా పేసర్ మహమ్మద్ షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌కు ఎట్టకేలకు శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది. 

గతేడాది అక్టోబర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్‌కు తీవ్రమైన గాయమైంది. దీంతో తర్వాత జరిగిన మ్యాచ్‌లకు అయ్యర్ దూరమయ్యాడు. డిసెంబర్ 25న (CoE)లో చేరిన శ్రేయస్.. స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్‌లో పురోగతి సాధించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో నాలుగు సెషన్లపాటు కఠినమైన సాధన పూర్తి చేశాడు. మ్యాచ్ సిమ్యులేషన్‌ సెషన్స్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు.

భారత తుది జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu