మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం...అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్

 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు. గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34 శాతం నీళ్లు చాలని  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతకాలు చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పేర్కొన్నారు. ఈ విషయంలో వాళ్లేదో గొప్పగా చేసినట్లు, మేము ఏదో తప్పు చేసినట్లు  బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని..గత ప్రభుత్వం కంటే మేము సమర్థవంతంగా నీటి హక్కులను కాపాడుతూ వస్తున్నామని తెలిపారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ రావకపోవడం దురదృష్టకరమని మంత్రి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది గత ప్రభుత్వమే ఉత్తమ్ చెప్పారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu