మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డ్రాప్ కి రూ.1 జరిమానా చెల్లించాల్సిందే

 

ఇప్పుడు భారతదేశంలో మొబైల్ ఫోన్లు వాడే వారి సంఖ్య నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానితో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య పోటీ కూడా చాలా పెరిగిపోతోంది. కానీ ఇతర నెట్ వర్క్ లలో ఉన్నవారిని, కొత్త కష్టమర్స్ ని ఆకర్షించడానికి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు చూపిస్తున్న శ్రద్ధ అందుకు అవసరమయిన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడంలో చూపించడం లేదు. ఇంతకు ముందు ఒక సెల్ ఫోన్ టవర్ కొన్ని వందలు మొబైల్ ఫోన్లు పనిచేస్తుంటే ఇప్పుడు అదే టవర్ల నుండి కొన్ని వేలు పనిచేస్తున్నాయి. సెల్ ఫోన్ టవర్స్ పై ఒత్తిడి పెరిగినప్పుడు అకస్మాత్తుగా కాల్స్ మధ్యలో కట్ అయిపోతుంటాయి.వాటినే కాల్ డ్రాప్స్ అంటారు.

 

కాల్ డ్రాప్స్ అయినప్పుడు ప్రజలు మళ్ళీమళ్ళీ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. దానివలన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకి మరింత ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదు. బహుశః అందుకే కనెక్షన్లు పెంచుకోవడంపై చూపిస్తున్నంత శ్రద్ద కొత్తగా టవర్స్ ఏర్పాటు చేసుకోవడంపై చూపడం లేదు. ఈ సమస్య ఎంతగా పెరిగిపోయిందంటే సాక్షాత్ రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులకీ ఈ కూడా ఈ బాధ తప్పడం లేదు. ఏదయినా తనదాకా వస్తే కానీ తెలియదంటారు పెద్దలు. ఆ కష్టం ఏమిటో ప్రభుత్వానికి కూడా తెలిసివచ్చిందిప్పుడు.

 

అందుకే టెలిఫోన్ రెగ్యులేటరీ అధారిటీ సంస్థ జనవరి 1, 2016 నుండి దేశంలో అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఒక్కో “కాల్ డ్రాప్” కి రూపాయి చొప్పున జరిమానగా వినియోగదారునికి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఒకరోజులో గరిష్టంగా కేవలం మూడు కాల్ డ్రాప్స్ కి మాత్రమే అంటే మూడు రూపాయలు మాత్రమే చెల్లించేందుకు పరిమితి విధించింది. వియోగదారుడు మాట్లాడుతున్నప్పుడు కాల్ మధ్యలోఒకవేళ కట్ అయినట్లయితే అప్పటి నుండి నాలుగు గంటలలోగా ఆ వినియోగదారుడుకి సదరు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఎస్.ఎం.ఎస్. మెసేజ్ ద్వారా డబ్బు చెల్లించబోతున్నట్లు తెలియజేయాల్సి ఉంటుంది.

 

పోస్ట్ పెయిడ్ వాళ్ళకి తరువాత బిల్లులో ఆ మొత్తం అడ్జస్ట్ చేయబడుతుంటుంది. ప్రీ పెయిడ్ వాళ్లకి అందుకు సరిసమానమయిన కాల్ సమయం పెంచబడుతుంది. దీనివలన తమపై చాలా విపరీతమయిన ఆర్దికభారం పడుతుందని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు వాదిస్తున్నారు. రోజుకి మూడు రూపాయల చొప్పున కొన్ని లక్షలు కోట్ల మందికి చెల్లించాలంటే తమ మనుగడ సాగించడం చాలా కష్టం అవుతుందని వాదిస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదనుకొంటే మరిన్ని సెల్ టవర్లు అత్యవసరంగా నిర్మించుకోవలసి ఉంటుందని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రజల దగ్గర ప్రతీ సెకనుకి డబ్బు వసూలు చేస్తున్నప్పుడు అందుకు తగ్గట్లుగా సేవలు కూడా అందించాల్సిన అవసరం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లపైనే ఉంది తప్ప ప్రభుత్వం పైనో ప్రజలపైనో కాదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu