తిరుమల అన్నమయ్య భవన్ సమీపంలో చిరుత సంచారం
posted on Jul 1, 2025 8:08PM

తిరుమల అన్నమయ్య అతిథి భవనం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఇనుప కంచెను దాటుకోని చిరుత వచ్చింది. సమాచారం అందుకోని ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు సైరన్ లు మ్రోగించడంతో తిరిగి ఫారెస్ట్‌లోకి చిరుత వెళ్లింది. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోనూ, మొదటి ఘాట్ రోడ్డులోనూ చిరుతలను చూసినట్లు భక్తులు చెబుతున్నారు.
దీంతో ఫారెస్ట్ అధికారులు అధికారులు అప్రమత్తమై, భక్తులకు సూచనలు జారీ చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, టీటీడీ సిబ్బంది కలిసి చిరుతల సంచారంపై నిఘా పెంచారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం గురించి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లకూడదని టీటీడీ అధికారులు హెచ్చరించారు.