డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ

 

ప్రపంచంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండా కారును డెలివరీ చేసి టెస్లా రికార్డు సృష్టించింది. తమ కారు సెల్ఫ్ డ్రైవింగ్ స్కిల్స్ ఏంటో తెలిసేలా టెస్లా ఓ వీడియో పోస్ట్ చేసింది. టెక్సాస్ గిగా ఫ్యాక్టరీ నుంచి 30 ని.లు డ్రైవ్ చేసుకుని టెస్లా కారు తన ఓనర్ ఇంటికి చేరుకుంది. పార్కింగ్ స్లాట్స్, హైవేలు దాటుకుంటూ దానంతట అదే వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. 

 ఏఐ సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్‌ కారు ‘మోడల్‌ వై’ను టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్‌ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన నూతన యజమాని ఇంటికి చేరుకుంది. ఎక్స్‌’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్‌ ఆపరేటింగ్‌ లేకుండా ఒక పబ్లిక్‌ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్‌ కారు తమదేనన్నారు