వివాహం తర్వాత మగవాళ్లు ఈ పనులు చేస్తే వైవాహిక జీవితం నాశనమే..!
posted on Sep 17, 2025 12:34PM

కాలేజీలకు వెళ్లి చదువుకోవడం, మంచి ర్యాంకులు తెచ్చుకోవడం, ఉద్యోగాలు సాధించడం, ఇల్లు, కారు, బ్యాంక్ బాలెన్స్ సమృద్దిగా ఉండటం.. ఇవన్నీ చదువులో రాణించడం వల్ల మంచి ఉద్యోగం వల్ల సాధించుకోవచ్చు ఏమో.. కానీ వివాహం చేసుకోవడం, వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచుకోవడం అలాంటిది కాదు. వైవాహిక బంధానికి చదువు, లెక్కలు, లాజిక్ ల కంటే.. అవగాహన, అర్థం చేసుకునే తత్వం, సర్థుబాటు చేసుకునే గుణం ఇవన్నీ చాలా ముఖ్యం. నేటికాలానికి తగ్గట్టు భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావు అన్నది వాస్తమే.. కానీ వివాహం తర్వాత భార్య అయినా, భర్త అయినా కొన్ని తప్పులు చేస్తారు. ముఖ్యంగా వివాహం తర్వాత మగవాళ్లు చేసే కొన్ని తప్పుుల వల్ల వైవాహిక బంధాలు నాశనం అవుతాయి. అవేంటో తెలుసుకుంటే..
వివాహం తర్వాత మరొక స్త్రీ పట్ల ఆకర్షితులవడం నైతికంగానే కాకుండా సామాజిక దృక్కోణం నుండి కూడా తప్పు. ఇది వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. ఇటువంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం చాలా డిస్టర్బ్ అవుతుంది.
జీవితంలో సంతృప్తిని కూడా చాలా ముఖ్యం. ఎప్పుడూ ఎక్కువ పొందాలనే కోరిక కలిగి ఉండటం, ప్రస్తుతం ఉన్న వాటితో అసంతృప్తి చెందడం మగవాడిని అశాంతి, అసంతృప్తికి గురి చేస్తుంది. ఇది వైవాహిక జీవితానికి మంచిది కాదు.
మగవాడు తీసుకునే నిర్ణయం అతని కుటుంబ భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని అన్ని అంశాలను తీవ్రంగా పరిగణించడం చాలా ముఖ్యం. తొందరపడి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇబ్బందులను కలిగిస్తుంది.
*రూపశ్రీ.