చాణక్యుడు చెప్పిన మాట.. ధనవంతులు కావాలంటే ఈ ప్రదేశాలకు దూరంగా ఉండాలట..!


ఆచార్య చాణక్యుడు తనదైన రాజనీతితో చరిత్రలో చెరగని ముద్ర వేశాడు.  ఈయన కేవలం రాజనీతి మాత్రమే కాకుండా తత్త్వ బోధన,  ఆర్థిక సూత్రాలు కూడా బోధించారు. చాణక్యుడి  ప్రణాళికల కారణంగానే మగధ రాజు చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు నేటికీ ఆచరించదగినవిగా ఉన్నాయి. ముఖ్యంగా చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలు పాటిస్తే వ్యక్తి జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లవచ్చు.  ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలలో ధనవంతులు కావాలంటే కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యం.  ఇంతకీ ధనవంతులు కావాలని కోరుకునేవారు ఏ ప్రదేశాలకు దూరంగా ఉండాలో.. చాణక్యుడు చెప్పినవి ఏంటో తెలుసుకుంటే..

ఏ ప్రదేశాలకు దూరంగా ఉంటే ధనవంతులు అవుతారు..

చాణక్యుడి ప్రకారం  వ్యాపార కార్యకలాపాలు దగ్గరలో  లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు. వ్యాపారం లేని ప్రదేశంలో నివసించే ప్రజలు తమ జీవితాలను పెద్దగా అబివృద్ది లేకుండా  గడుపుతారు. అదేవిధంగా, ఒక ప్రదేశంలో వేదాల పరిజ్ఞానం ఉన్న పండితులు లేదా బ్రాహ్మణులు లేకపోతే, అక్కడ నివసించడం ప్రయోజనకరం కాదు. బ్రాహ్మణులు సమాజం  మతపరమైన,  సాంస్కృతిక విలువలను కాపాడతారని చాణక్యుడు చెబుతాడు. వారు లేనప్పుడు ఆ ప్రదేశం పురోగతికి అనుకూలంగా ఉండదట.

నీరు లేకుండా జీవితాన్ని ఊహించలేము. అందువల్ల నదులు, చెరువులు లేదా ఇతర నీటి వనరులు అందుబాటులో లేని ప్రదేశాలలో నివసించడం మంచిది కాదు. నీరు లేనప్పుడు జీవితం కష్టమవుతుంది.   అభివృద్ధి కూడా ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివసించడం వల్ల నీటి సేకరణకే సమయం గడిచిపోతుంటుంది. దీని వల్ల కొన్ని ఆదాయ అవకాశాలకు సమయం వృధా అవుతుంది.

 వైద్య సదుపాయాల అవసరం ఈ కాలంలో చాలా చాలా ముఖ్యం. ఈ విషయాన్ని చంద్రగుప్త కాలానికే చాణక్యుడు చాలా గట్టిగా చెప్పాడు. ఏదైనా వ్యాధి, ప్రమాదం లేదా ఆరోగ్య సమస్య ఎదురైతే దాని  పరిష్కారానికి వైద్య సేవలు అవసరం. వైద్యుడు లేదా వైద్య సదుపాయాలు   లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు.

చాణక్యుడు చెప్పినట్టు పైన చెప్పిన వనరులు లేని ప్రదేశాలలో నివసించడం వల్ల ఆర్థికంగా అస్సలు ఎదుగుదల ఉండదు. ఎంత ప్రయత్నించినా సరే.. ఆర్థికంగా బలపడటానికి తగిన అవకాశాలు, సమయాన్ని పొదుపు చేసే మార్గాలు,  ఆరోగ్యాన్ని రక్షించుకునే పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎప్పటికప్పుడు దిగజారిపోతూ ఉంటారు.  కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ధనవంతులుగా ఎదిగే మార్గం దొరికినట్టే.

                           *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu