కొత్త ఏడాదిలో జీవితాన్ని మార్చే 5 మ్యాజిక్ టిప్స్ ఇవి..!

 

కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు. అయితే కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు వాటిని భరించాలని,  ఓర్పుతో వాటిని అధిగమించాని తెలిసిన మనుషులు ఆరోగ్యం దగ్గర మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  సింపుల్ గా చెప్పాలంటే నేటికాలంలో ఆరోగ్యం విషయంలో సర్దుబాటు చేసుకునే వారు ఎక్కువ. అలాగే జీవితం అంటే ఎప్పుడూ ఇంతే అని నిరాశలో బ్రతికేవారు కూడా ఎక్కువే.  ప్రతి సారి ఇలాంటివి  మామూలే అనుకోకుండా కనీసం   కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం, జీవితం  గురించి కాస్త శ్రద్ద పెట్టడం వల్ల మెరుగవ్వచ్చు. 5 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జీవితమే మారిపోతుంది.  ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

 

ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా ఉండగలం..
పైన పేర్కొన్న విషయాన్ని  స్పష్టంగా అర్థం చేసుకుంటే చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం వల్ల  శక్తి, సమయం,  డబ్బు ఆదా అవుతాయి. అంతేకాదు ఇతరులకు సహాయం చేయవచ్చు. తాము ఆరోగ్యంగా, పాజిటివ్ గా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా అటు వైపు ఇన్ప్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది.

 

బరువు మాత్రమే కాదు..
చాలా మంది ఆరోగ్యం గురించి తీసుకునే నిర్ణయాలలో ఈ ఏడాది బరువు తగ్గాలి.. లాంటివి ఉంటాయి. అయితే బాగా ఆరోగ్యంగా ఉండటం అంటే బరువు తగ్గడం,  పొట్ట తగ్గించుకోవడం మాత్రమే కాదు. తెలివితేటలను, మనస్సును నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. జిమ్‌లో కండరాలు పెంచడానికి వ్యాయామం చేయడమే కాదు.. నలుగురికి సహాయపడటం, మానవత్వంతో ఉండటం వంటి గుణాలు కూడా ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎన్నో రెట్లు మెరుగుపరుస్తాయి.

 

నిద్ర ముఖ్యం..
కార్పొరేట్ ఉద్యోగాలు, యంత్రాల్లా పని చేసే మనుషులు,  ఎలక్ట్రానిక్ వస్తువుల్లా సాగే శరీరాలు..  ఇది మాత్రమే కాకుండా  గాడ్జెట్‌లు నాణ్యమైన నిద్ర అంటే ఏంటో తెలియకుండా మనుషులను మార్చేశాయి. అందుకే ఈ నూతన సంవత్సరంలో నిద్ర విషయంలో రాజీ పడకూడదని ఎవరికి వారు ఒక నిబంధన పెట్టుకోవాలి. శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకోవడానికి, ఎలాంటి జబ్బులు శరీరానికి కలగకుండా ఉండటానికి  ప్రతి రాత్రి సమయానికి నిద్రపోవాలి. ఇది  నిద్ర కణాలను పునరుజ్జీవింపజేస్తుంది, మరుసటి రోజు లేవగానే ఎనర్జీగా ఉండేందుకు,  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గేందుకు సహాయపడుతుంది.

 

శ్వాస- ప్రాణ శక్తి..
ప్రతిరోజూ కొంత సమయం శ్వాసపై శ్రద్ధ వహించాలి. కాలానుగుణ పండ్లు,  కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చేస్తే శరీరంలో మంచి ఎనర్జీ, ప్రాణ శక్తి మెరుగవుతాయి. రోజువారీ అలసట అధిగమించడానికి ప్రకృతిలో సమయం గడపాలి.  సూర్యకాంతిలో గడపడం,   స్వచ్ఛమైన గాలి ఉన్న చోట  నడవడం. నేలపై చెప్పులు లేకుండా నడవడం, వంటివి చేయాలి. ప్రకృతిని గౌరవిస్తే అది ప్రేమను, శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది.

 

ప్రతిభ- సామర్థ్యం..
ప్రతి వ్యక్తి తమలో ఉన్న  ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితాలు పొందగలుగుతారు. ఏదో బ్రతికేస్తున్నాం అనుకోకుండా  జీవితాన్ని మరింత అందంగా ఎలా మార్చుకోవాలో,  అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి.  ఇది జీవితంలో అబివృద్దికి దారి తీస్తుంది.

 

- రూపశ్రీ

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News