క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

క్రిస్మస్ అనేది  క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 25న   జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, కరుణ, శాంతి,  మానవత్వం యొక్క సందేశాన్ని ప్రపంచమంతా తెలియజేస్తుంది.  క్రిస్మస్ పండుగ రోజున ప్రతి  ఇల్లు దీపాలతో,  నక్షత్ర ఆకారపు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.  అంతే కాదు.. క్రిస్మస్ మతం తో సంబందం లేకుండా అన్ని మతాల వారినీ కేక్ కటింగ్ కు పిలుస్తారు.  ఇలా అందరూ క్రిస్మస్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు.  అయితే డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ పండుగ జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి? క్రిస్మస్ పండుగ రోజు స్నేహితులకు ఎలాంటి బహుమతులు ఇవ్వడం మంచిది? తెలుసుకుంటే..

డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకంటే

మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ,  త్యాగం యొక్క మార్గాన్ని చూపిం చాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.

క్రిస్మస్ సంప్రదాయాలు

క్రిస్మస్ రోజున ప్రజలు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రభువైన యేసు జీవితాన్ని, ఆయన  బోధనలను గుర్తుచేసుకుంటారు.  క్రైస్తవుల ప్రతి ఇంట్లో  క్రిస్మస్ చెట్లను అలంకరిస్తారు, కరోల్స్ పాడతారు,  కేకులు కట్ చేస్తారు. పిల్లలలో శాంతా క్లాజ్ ఆనందంగా గడుపుతారు.  క్రిస్మస్ ముఖ్యంగా  బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి  పెద్ద పీట వేస్తుంది. ముఖ్యంగా  ఈ పండుగ పేదలకు సహాయం చేయడానికి,  దాతృత్వానికి దానం చేయడానికి కూడా ప్రేరణనిస్తుంది. క్రిస్మస్ రోజున స్నేహితులకు, పరిచయస్తులకు గిఫ్ట్ లు ఇస్తుంటారు.  

స్నేహితులకు, పరిచయస్తులకు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలి

చాక్లెట్లు, ప్లం కేకులు,  కుకీలను క్రిస్మస్ కోసం సాంప్రదాయంగానూ,  గొప్ప  బహుమతులుగానూ భావిస్తారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన కేకులు,  కుకీలు స్నేహాలకు తీపిని జోడిస్తాయి,  సాన్నిహిత్యాన్ని బలపరుస్తాయి. గ్రీటింగ్ కార్డ్, ఫోటో ఫ్రేమ్ లేదా  ఏదైనా చాలా సొంతంగా తయారు చేసిన బహుమతులు  చాలా ప్రత్యేకమైనవి. అలాంటి బహుమతులు సమయాన్ని,  ఓపికను,  కష్టాన్ని స్నేహితుల కోసం వినియోగిస్తే చాలా మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ను పెంచుతాయి. పుస్తకాలను చాలా గొప్ప  బహుమతిగా పరిగణిస్తారు. స్నేహితుడి ఆసక్తికి సంబంధించిన ప్రేరణాత్మక, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వవచ్చు.    పుస్తకం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. సువాసనగల కొవ్వొత్తులు,  అలంకరణ వస్తువులు, షోపీస్‌లు,  క్రిస్మస్ నేపథ్య అలంకరణ వస్తువులు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ బహుమతులు పండుగకు గల ఉద్దేశ్యాన్ని  మరింత ప్రత్యేకంగా చేస్తాయి. పర్సనల్ గా ఇచ్చి పుచ్చుకునే బహుమతులు కూడా క్రిస్మస్ లో ప్రాధాన్యత కలిగి ఉంటాయి.  మగ్గులు, కుషన్లు, డైరీలు, పేరు లేదా ఫోటోతో కూడిన కీ చైన్‌లు వంటి పర్సనల్  బహుమతులు  బాగుంటాయి. పైన పేర్కొన్న బహుమతులు అవతలి వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. పిల్లల కోసం ప్రత్యేక బహుమతులు ఇవ్వాలంటే  వారికి బొమ్మలు, కథల పుస్తకాలు, డ్రాయింగ్ లేదా పెయింటింగ్ కిట్‌లను బహుమతిగా ఇవ్వడం చాలా మంచి సెలెక్షన్ అవుతుంది. ఇది పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

-రూపశ్రీ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News