ఫిబ్రవరి 11న తెలంగాణ మునిసిపోల్స్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది.  తెలంగాణ వ్యాప్తంగా 115 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.  అదే నెల 13న ఫలితాలు వెలువడుతాయి.  ఇక ఈ ఎన్నికలకు బుధవారం (జనవరి 28) నుంచి  శుక్రవారం (జనవరి30)  వరకు   నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.  మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.  అయితే వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై వచ్చే నెల 10 తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అది పక్కన పెడితే తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయాలనుకునే వారు ఆస్తిపన్ను బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే పోటీకి అర్హత ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

అయితే జీహెచ్ఎంసీ ఒకే సంస్థగా కొనసాగుతుందా లేక మూడుగా విడిపోతుందా అనేది ఫిబ్రవరి 10 తర్వాత నిర్ణయిస్తామన్నారు మంత్రి పొన్నం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే.. నామినేషన్‌ వేయడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu