రాజకీయపార్టీగా తెలంగాణ జాగృతి.. రిజిస్ట్రేషన్ కోసం కవిత దరఖాస్తు

తెలంగాణ జాగృతి ఇక రాజకీయపార్టీగా అవతరించనుంది. ఈ మేరకు తన కొత్త రాజకీయపార్టీ పేరును తెలంగాణ జాగృతిగా పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత నిర్ణయించారు. ఇందు కోసం ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేయడమే కాకుండా.. సాధ్యమైనంత త్వరగా తన పార్టీకి అధికారిక గుర్తింపునకు ఆమె స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి వచ్చారు.

ఇక ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తెలంగాణ జాగృతికి మూడు నెలల వ్యవధిలో రాజకీయపార్టీగా అధికారిక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు, కార్యకలాపాలకే పరిమితమైన తెలంగాణ జాగృతి, ఇక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలోనే తెలంగాణ జాగృతి అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయపార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కవిత చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే  అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమ కారులను ఏకం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu