రేవంత్‌రెడ్డి స్పై సంతోష్‌రావు.. కవిత సంచలన ఆరోపణ

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధినేత్రి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ చేశారు.    ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసి మంగళవారం సాయంత్రం విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. సరిగ్గా సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కావడానికి కొద్ది గంటల ముందు కవిత ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.  కేసీఆర్ దగ్గర ఉన్న మొదటి దెయ్యం సంతోష్ అని వ్యాఖ్యానించిన కవిత సంతోష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి అని పేర్కొన్నారు. 

ఫాంహౌస్‌లో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నారా? సగం ఇడ్లీ తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా సంతోష్ రావు రేవంత్ కు చేరవేస్తారని కవిత అన్నారు.  బీఆర్ఎస్‌లో ఎందరో నేతలతో కన్నీళ్లు పెట్టించిన దుర్మార్గుడు సంతోష్ అని మండిపడ్డారు. ప్రగతి భవన్ గేటు బయట గద్దర్‌ను నిలబెట్టింది,  బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ సస్పెండ్‌ అవ్వడానికి కారణమైంది కూడా  సంతోష్ రావే అని ఆరోపించారు.  అలాంటి వ్యక్తికి అనుకూలంగా కేటీఆర్, హరీశ్ రావు  ట్వీట్లు పెట్టడాన్ని బీఆర్ఎస్ క్యాడర్ గమనించాలని  కవిత సూచించారు. బీఆర్ఎస్‌లో అన్ని దుర్మార్గాలకు కారణం సంతోష్ రావేనని  కవిత తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu