వణుకు తగ్గింది.. ఉక్కపోత మొదలైంది!

తెలంగాణలో నిన్నమొన్నటి వరకూ వణికించిన చలి తగ్గుముఖం పట్టింది. ఇక వేసవి ఉక్కపోత మొదలైంది. ఔను రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదౌతున్నాయి. చలి కాలం ముగియడానికి ముందే రాష్ట్రంలో వేసవి ఛాయలు కనిపిస్తున్నాయి.  

రాత్రి  ఉష్ణోగ్రతలు 14 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదౌతున్నాయి.  హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో రాత్రి  ఉష్ణోగ్రత 18.2 డిగ్రీలుగా నమోదైంది. ఇక కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధారిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీనిని బట్టే రాష్ట్రంలో ఇక వేసవి ఎండలు మండే కాలం వచ్చేసిందని గ్రహించవచ్చు.   హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో రాత్రిపూట ఉక్కపోత మొదలైంది. రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu