ఆ పైప్ లైన్లు... తెలంగాణకు లైఫ్ లైన్లు

వాటర్ గ్రిడ్ పైప్ లైన్లను తెలంగాణ ప్రజల లైఫ్ లైన్లుగా అభివర్ణించారు మంత్రి కేటీఆర్, వాటర్ గ్రిడ్ పై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో పాల్గొన్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.... వాటర్ గ్రిడ్ పూర్తయ్యాక తెలంగాణలో ఏ ఆడబిడ్డా మంచినీటి కోసం రోడ్డెక్కదంటూ హామీ ఇచ్చారు.

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న విపక్షాల ఆరోపణల్లో పసలేదని, ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా పాడుకాకుండా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో 20వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయాల్సి ఉంటుందన్న కేటీఆర్... ప్రస్తుతం 106 వాటర్ గ్రిడ్ ప్లాంట్లు ఉన్నట్లు తెలియజేశారు, 226 చోట్ల రైల్వే క్రాసింగ్స్ ను దాటాల్సి ఉందని, దాంతోపాటు ఆరు శాఖలను సమన్వయం చేసుకుని, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు,

మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తిచేసి తీరతామన్న కేటీఆర్.... ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకుండా పనిచేస్తామన్నారు, వాటర్ గ్రిడ్ ను రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తుంటే, కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ మాత్రం అభినందించారంటూ విపక్షాలకు చురకలంటించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu