పాక్ కు సుష్మ వార్నింగ్...
posted on Apr 11, 2017 1:11PM

భారత్ రా ఏజెంట్ కుల్‌భూషణ్ జాధవ్ కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్ గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో పాకిస్థాన్ లో అరెస్ట్ అయ్యారు. పాకిస్థాన్ మిలిటరీ కోర్టు. ఫీల్డ్ జనరల్ కోర్ట్ మార్షల్ కుల్‌భూషణ్‌ను విచారించి ఉరిశిక్ష వేసింది. ఇక దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాజ్యసభలో మాట్లాడిన సుష్మ స్వరాజ్...కుల్‌భూషణ్ జాధవ్ విషయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవరిస్తోందని.. నిష్పక్షపాతంగా విచారణ జరపకుండానే పాకిస్తాన్ మిలటరీ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించిందని మండిపడ్డారు. అంతేకాదు కుల్‌భూషణ్ కు ఉరిశిక్ష విధిస్తే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలకు పాకిస్తాన్ బాధ్యత వహించాల్సివుంటుందని సుష్మ హెచ్చరించారు. కుల్‌భూషణ్ కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు. అతడికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.