అమెరికాకు ఉత్తర కొరియా వార్నింగ్... యుద్దానికి సిద్దమే..
posted on Apr 11, 2017 2:41PM

పక్క దేశాల మాటలు పట్టించుకోకుండా ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా చేస్తున్న ప్రయోగాలకు జపాన్, దక్షిణకొరియా దేశాలతో పాటు పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఉత్తర కొరియా మరో అడుగు ముందుకేసి అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది. సిరియాలో రసాయనిక దాడుల అనంతరం అమెరికా దానికి వ్యతిరేకంగా దాడి జరిపింది. ఇక దీనిపై స్పందించిన ఉత్తర కొరియా...తమను బెదిరించడానికో, అదుపులో పెట్టడానికో సిరియాపై అమెరికా దాడులు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. తమతో యుద్ధం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్టైతే... అందుకు తాము సిద్ధమని చెప్పారు. ఎలాంటి తరహా యుద్ధానికైనా తాము సన్నద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూద్దాం.