బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై ఏమన్నారంటే?
posted on Dec 16, 2025 6:47PM

ఇటీవల బిజినెస్ టుడే అవార్డునందుకుని వార్తల్లో నిలిచిన నారా బ్రాహ్మణికి సంబంధించి కొత్త అప్ డేట్ డెలివరీ అయ్యింది. ఆమె తాను రాజకీయాల్లోకి రమ్మంటే వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారాయన. కారణం.. తనకది అంత ప్రాధాన్యతాంశం కాదని కూడా చెప్పుకొచ్చారు బ్రాహ్మణి. మరి చంద్రబాబు అడిగినా మీరు రాజకీయాల్లోకి రారా అంటే ఏమంత ఇంట్రస్ట్ లేదని అన్నారు బ్రాహ్మణి.
ఇలాంటి అనాసక్తి కలిగి ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే వారిలో జయలలిత, సోనియాగాంధీ, ఆ మాటకొస్తే భారతీరెడ్డి వంటి వారెవరికీ పొలిటిక్స్ అంటే ఏమంత ఇంట్రస్ట్ కానే కాదు. జయలలితకు ఆ మాటకొస్తే సినిమాలే ఇంట్రస్టింగ్ టాపిక్ కాదు. కానీ తన తల్లి కోరిక మేరకు ఆమె బలవంతానా సినిమాల్లోకి వచ్చి ఆ కాలపు అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగారు. అటు పిమ్మట ఎంజీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆమె, ప్రచార కార్యదర్శిగా నియమితులవడం. ఆపై ఆయన మరణించాక యాక్టివ్ పాలిటిక్స్ లో అడుగు పెట్టడంతో సీఎం స్థాయికి చేరి.. డీఎంకేతో కరుణానిధితో ఢీ అంటే ఢీ అన్నారు.
ఇక సోనియాగాంధీకి కూడా రాజకీయ రంగం ప్రాధాన్యతాంశం ఏమీ కాదు. ఆమె రాజీవ్ గాంధీ అనే రాజకీయ కుటుంబంలోని వ్యక్తి ప్రేమలో ఉన్నాన్న విషయం ఆలస్యంగా గ్రహించారు. అప్పటికీ తన భర్తతో కలసి ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఫైనల్ గా ఇందిర మరణం తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాజీవ్ ప్రధాని కావడం.. ఆపై ఆయన మరణం తర్వాత ఒక గ్యాప్ ఏర్పడ్డం. కాంగ్రెస్ పార్టీ పతనావస్త మొదలవుతుందనగా.. సోనియా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఎంట్రీ ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఇటు యూపీఏ చైర్ పర్సన్ గా చక్రం తిప్పడం మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఎదిగారామె.
వైసీపీ అధినేత జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి కూడా ఏమంత రాజకీయాసక్తులు లేవు. ఇక్కడుంటే జైల్లో పెడుతున్నారు. కాబట్టి ఏ విదేశాలకో వెళ్లి సెటిలవుతామని తాను తన భర్తను కోరినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారామె. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రి సతీమణిగా ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.
మొన్న చంద్రబాబు జైల్లో ఉన్నపుడు అత్త భువనేశ్వరితో కలసి ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు బ్రాహ్మణి. ఆ తర్వాత ఆమె రాజకీయ అరంగేట్రంపై కూడా పలు కామెంట్లు వినవచ్చాయి. ఈలోగా చంద్రబాబు రిలీజ్ కావడం. కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించడం. తన భర్త లోకేష్ కూడా మంత్రిగా బిజీ కావడంతో ప్రస్తుతం బ్రాహ్మణి ఫుల్ హ్యాపీ.
ఈ లీజర్ లో ఆమె హెరిటేజ్ వ్యవహారాలు పట్టించుకుంటున్నారు. పాడి రైతుల కోసం తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ తృప్తి తనకు చాలంటున్నారామె. అయితే రాజకీయ అవసరాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు. కాబట్టి ఒక వేళ ఆమె ఇంట్రస్ట్ లేదన్నా.. సరే ఫ్యూచర్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటారు పలువురు.