ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడి వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్‌

అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ కాల్పులకు తెగబడి నరమేథం సృష్టించిన నిందితుడి వద్ద ఇండియన్ పాస్ పోర్టు లభించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచస్తున్నాయి.  ఈ ఘటనలో నిందితుడైన   సాజిత్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా, అతడు  హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి. ఈ ప్రయాణాల వెనుక ఉద్దేశాలు ఏమిటన్న కోణంలో  దర్యాప్తు కొనసాగుతోంది.

ఇలా సాజిత్ వద్ద లభించిన పాస్‌పోర్ట్ వివరాలు హైదరాబాద్ చిరునామాతో ఉండటంతో భారత కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అతడి కుటుంబ సభ్యుల వివరాలు, నేపథ్యం తదితర  అంశాలపై నిఘావర్గాలు కూపీలాగుతున్నాయి.  ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోవడంతో, భారతదేశం– ఆస్ట్రేలియా అధికారుల మధ్య సమన్వయంతో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu