ఐపీఎల్ 2026 వేలం.. కామెరూన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు

 

ఐపీఎల్ 2026 మినీ వేలం సంచలనాలతో మొదలైంది. అందరూ భావించినట్లుగా అస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. కనీస్ ధర రూ.2 కోట్లు ఉన్న అతడ్ని దక్కించుకోవడం కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయ. మధ్యలో సీఎస్కే కూడా రేసులోకి వచ్చింది. చివరకు కోల్‌కతా రూ.25.20 కోట్లకు గ్రీన్‌ను కొనుగోలు చేసింది. 

దాంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన వీదేశీ ప్లేయర్‌గా కామెరూన్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2024లో మిచెల్ స్టార్క్‌ను  కేకేఆర్ రూ.24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పుడా రికార్డును గ్రీన్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో కామెరూన్ గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. రిషబ్‌పంత్ (రూ,27 కోట్లు),  శ్రేయస్ అయ్యర్ (రూ,26.75 కోట్లు), పంజాబ్ కింగ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

ప్రస్తుత వేలంలో సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్‌ను అతడి కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. భారత్ క్రికెటర్ వెంకటేష్ అయ్యార్ కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడగా.. రూ.7 కోట్లకు వెంకటేష్‌ను బెంగళూరు సొంతం చేసుకుంది.  సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌ను రూ.కోటికి ముంబాయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెటన్ ఢిల్లి రూ.కోట్లకు దక్కించుకుంది. కివీస్ ప్లేయర్ ఫిన్ అలెన్ను రూ.2 కోట్లకు కేకేఆర్ తీసుకుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu