కన్నకూతురిని కడతేర్చిన తల్లి!

కడుపు చించుకు పుట్టిన కుమార్తెనే కడతేర్చిన ఒక తల్లి ఉదంతమిది. తన కుమార్తెను దేవుడు మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకంతోనే చంపేసినట్లు చెబుతున్న ఆ తల్లిది ఉన్మాదమా, మూఢనమ్మకమా, పిచ్చా అని స్థానికులు దుయ్యబడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 

మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వసంతపురి కాలనీలో నివాసముంటున్న మోనాలిసా అనే మహిళ తన ఏడేళ్ల కుమార్తె  షారోని మేరిని ఒక్కసారిగా బిల్డింగ్  మూడో అంతస్తు పైనుంచి కిందకు తోసివేసింది‌. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటికి వచ్చి చూడగా చిన్నారి రక్తమడుగులో పడి ఉంది.  వెంటనే చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై సమా చారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. తల్లి మోనాలిసాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకం తో తన పాపను చంపానని తల్లి చెప్పడంతో  ఆమెది మూఢ విశ్వాసమా, మానసిక స్థితి సరిగా లేదా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu