దుబాయ్‌లో ఉద్యోగావకాశం.. అంతలో కబళించిన మృత్యువు
posted on Sep 27, 2022 5:05PM
పుట్టుకతోపాటు మరణాన్ని గౌరవించాలంటారు తత్త్వవేత్తలు. వారికేం ఇలాంటివి ఎన్నయినా చెబు తారు.. ఒకరు దూరమయిన బాధను భరించేవారికి తెలుస్తుందంటారు సామాన్యులు. ఇంట్లో ఒకరు మరణం వల్ల దూరమయితే ఆ వ్యధ జీవితాంతం పెను భారంగా మారుతుంది. మరీ ముఖ్యంగా తమను భవిష్యత్తులో దగ్గరుండి చూసుకోవాల్సిన కొడుకుని మృత్యువు అమాంతం తీసికెళిపోతే ఆ తల్లిదండ్రుల వ్యధ వర్ణనా తీతం. తెలంగాణా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు 23 ఏళ్ల అభిజిత్ కార్డియాక్ అరెస్ట్‌తో మర ణించాడు.
వరంగల్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన అభిజిత్ వచ్చే నెలలో దుబాయ్‌లోని ఆయిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. రూ.58 లక్షల జీతంతో ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో.. అభిజిత్ ఆకస్మిక మృతి ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది.
అంతా సంతోషకరంగా కొనసాగుతున్న తరుణంలో విధి వక్రీకరించింది. అభిజిత్ రెడ్డి ఛాతీలో ఇబ్బం దికి గురయ్యాడు. కుప్పకూలిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు వెంటనే సీపీఆర్ చేశారు. అనం తరం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటిం చారు. కార్డియాక్ అటాక్ తో ఆయన చనిపోయినట్టు తెలిపారు.
మరోవైపు కార్డియాలజిస్ట్ డాక్టర్ వైపీ రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం యువత అనేక కారణాల వల్ల ఒత్తిడు లకు లోనయి హార్ట్ అటాక్ కు గురవుతున్నారని చెప్పారు.