మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు భేటీ
posted on Jan 24, 2026 11:25AM

ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంచలన రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ వివరాలను అధినేత కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిట్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. అయితే ఈ కేసులో ఆఖర్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందనే జోరుగా చర్చ జరుగుతోంది.